Snake: వామ్మో.. పాము ద్విచక్రవాహనంలోకి ఎలా దూరిందో చూడండి
ABN , First Publish Date - 2023-12-13T11:50:04+05:30 IST
మరమ్మతుల కోసం వచ్చిన ద్విచక్రవాహనంలో ఉన్న పాము(Snake)ను అగ్నిమాపక సిబ్బంది పట్టి అటవీ శాఖ
ఐసిఎఫ్(చెన్నై): మరమ్మతుల కోసం వచ్చిన ద్విచక్రవాహనంలో ఉన్న పాము(Snake)ను అగ్నిమాపక సిబ్బంది పట్టి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. స్థానిక రెడ్‌హిల్స్ పద్మావతినగర్ మెయిన్ రోడ్డులో ఉన్న మెకానిక్ షాపులో మరమ్మతుల కోసం ఓ వ్యక్తి స్కూటర్ ఇచ్చి వెళ్లారు. వాహనం ముందు భాగంలో ఏదో శబ్దం వినిపిస్తుండడంతో మెకానిక్ ముందు భాగాన్ని విప్పి చూశాడు. పాము చుట్టుచుట్టుకొని పడుకొని ఉండడాన్ని గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సుమారు 7 అడుగుల పొడవున్న పామును పట్టిన అగ్నిమాపక సిబ్బంది అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.