Singer Mangli: పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా..

ABN , First Publish Date - 2023-01-17T11:57:28+05:30 IST

టాలీవుడ్‌లో ‘కన్నే అదిరింది’ (Kanne Adirindi) అనే పాటతో సెన్సేషన్‌ గాయని (Singer)గా గుర్తింపు పొందిన మంగ్లి తాజాగా పాన్‌ ఇండియా చిత్రంలో నటించబోతోంది.

Singer Mangli: పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా..
Mangli

టాలీవుడ్‌లో ‘కన్నే అదిరింది’ (Kanne Adirindi) అనే పాటతో సెన్సేషన్‌ గాయని (Singer)గా గుర్తింపు పొందిన మంగ్లి తాజాగా పాన్‌ ఇండియా చిత్రంలో నటించబోతోంది. చక్రవర్తి చంద్రచూడ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పాదరాయ’(Padaraya)తో మంగ్లీ హీరోయిన్‌గా మారనుంది. ఈ మూవీ టైటిల్‌ను బెంగుళూరులో తాజాగా ఆవిష్కరించారు. తెలుగుతో పాటు శాండల్‌వుడ్‌లోనూ అనేక సినిమాల్లో పాటలు పాడిన మంగ్లి కన్నడిగుల అభిమానాన్ని కూడా చూరగొన్నారు. శాండల్‌వుడ్‌లో పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు.

mangli1.jpg

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. చిత్రీకరణకు ముందు హీరో నాగశేఖర్‌ 42 రోజుల పాటు హనుమద్‌ వ్రతాన్ని పాటించనున్నారు. అంజనాద్రి కొండల్లో ఆయన మాల ధరించారు. 2013-14లో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా ఆరు రాష్ట్రాలతో లింక్‌ కలిగి ఉండనుండటం మరో విశేషం. త్వరలోనే సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తారాగణం ఎంపిక ఇంకా జరుగుతోందని దర్శకుడు చంద్రచూడ్‌ మీడియాకు తెలిపారు. సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై ఆర్‌ చంద్రు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజనీశ్‌ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

mangli2.jpg

Updated Date - 2023-01-17T11:57:40+05:30 IST