Share News

Shocking: రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. ఈ 75 ఏళ్ల వ్యక్తి నుంచి ఏకంగా రూ.3.30 కోట్లు ఎలా కొట్టేశారో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-11-10T16:18:29+05:30 IST

పాపం 75ఏళ్ల వ్యక్తి నుంచి ఏకంగా 3.30కోట్ల రూపాయలు కొట్టేశారు. డబ్బు కొట్టేయడానికి వారు నడిపినా డ్రామా తెలిస్తే షాకవుతారు.

Shocking: రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. ఈ 75 ఏళ్ల వ్యక్తి నుంచి ఏకంగా రూ.3.30 కోట్లు ఎలా కొట్టేశారో తెలిస్తే..!

డబ్బులు చెట్లకేమీ కాయవు. డబ్బు సంపాదించడానికి ఎంతోమంది కష్టపడి పనిచేస్తారు. మరికొందరు మాత్రం కష్టపడకుండా కడుపు చల్ల కదలకుండా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. ఇలా ఈజీ మనీ వేటలో తమకు తెలియకుండానే సైబర్ నేరాలలోకి దిగుతున్నారు. వీళ్ల కన్ను పడిందంటే బ్యాంక్ అకౌంట్లు నిమిషాల మీద ఖాళీ అయిపోతాయి. ఎంత జాగ్రత్తపరులను అయినా బురిడీ కొట్టిస్తారు. పాపం 75ఏళ్ల వ్యక్తి నుంచి ఏకంగా 3.30కోట్ల రూపాయలు కొట్టేశారు. డబ్బు కొట్టేయడానికి వారు నడిపినా డ్రామా తెలిస్తే అందరూ షాకవుతారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ముంబై(Mumbai)లో పెద్ద సైబర్ నేరమే వెలుగుచూసింది. 75ఏళ్ల ఓ వృద్ద వ్యాపారవేత్తకు(75 years old business men) ఓ మహిళ నుండి ఇమెయిల్ రావడంతో ఈ మోసానికి పునాది పడింది. ఉక్రెయిన్(Ukraine) కు చెందిన ఎసెమా అనే ఓ మహిళ ముంబైకు చెందిన 75ఏళ్ల వృద్ద వ్యాపారిని ఇమెయిల్ లో సంప్రదించింది. ఆమె ఉక్రెయిన్ లో చాలా వ్యాపారాలు చేశానని చెప్పుకుంది. ఉక్రెయిన్ యుద్ద కారణంగా తన వ్యాపారం అంతా తుడిచిపెట్టుకుపోయిందని ఇప్పుడు అక్కడ వ్యాపారం చేసే అవకాశం లేదని ఆమె చెప్పుకొచ్చింది. తనకు భారతదేశంలో వ్యాపారం ప్రారంభించాలని ఉందన్నట్టు ఆమె వృద్దుడిని నమ్మించింది. ఆమె మాటలు నిజమేనని వృద్దుడు నమ్మాడు. ఉక్రెయిన్ మహిళ మొదట వృద్దుడి దగ్గర తనకు కావలసిన యంత్రాలు కొనుగోలు చేస్తానని చెప్పింది. కానీ ఆ తరువాత వ్యాపారంలో పార్టర్నర్ గా చేరతానని చెప్పింది. అందుకోసం పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తానని కూడా చెప్పింది.

ఇది కూడా చదవండి: Viral Video: అమ్మ బాబోయ్.. ఇదేం అద్భుతం.. కింద పడి ఉన్న ఈ ఆకును కర్రపుల్లతో కదపగానే.. షాకింగ్ సీన్..!



ఉక్రెయిన్ మహిళ వ్యాపారానికి డబ్బు పెడతానని అనడంతో వృద్దుడు ఆసక్తి చూపించాడు. అనంతరం తనకు అంగీకారమే అని అతను ఆమెకు చెప్పాడు. ఈ క్రమంలో ఆమె 8కోట్ల రూపాయలకు సమానమైన 9.7డాలర్ల బాక్సును పంపుతున్నానని అతనికి సమాచారం అందించింది. దానికి తగినట్టుగానే ట్రాకింగ్ ఐడి కూడా పంపింది. అది చేరడానికి కొద్దిరోజుల సమయం పడుతుందని ఆమె చెప్పింది. ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత వృద్దుడికి ఫోన్ కాల్ వచ్చింది. జకార్తాలో పెద్దమొత్తంలో డబ్బు ఉన్న పెట్టెను ఇండోనేషియా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు ఫోన్ లో చెప్పారు. ఆదాయపు పన్ను నివేదికలు, పవర్ ఆఫ్ అటార్నీ, భీమా పత్రాలతో సహా వివిధ రకాల ధృవపత్రాలు సమర్పించాలని లేకపోతే వాటికి జరిమానా కట్టాలని వారు ఫోన్ లో తెలిపారు. ఉక్రెయిన్ మహిళ కూడా 8కోట్ల డబ్బు చెయ్యి జారిపోతుందని వారు చెప్పినట్టు వింటే పెద్ద మొత్తం డబ్బు చేతికి అందుతుందని వృద్దుడికి చెప్పింది. దీంతో 8కోట్ల విలువైన కరెన్సీని రికవరీ చేసుకోవాలనే ఆశలో వృద్దుడు ఏకంగా రూ. 3.30కోట్లను 101 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. 8నెలల సమయం గడిచింది కానీ ఇప్పటి వరకు ఆ కరెన్సీకి సంబంధించిన పెట్టె అతనికి చేరలేదు. కొనమెరుపు ఏంటంటే ఈ సంఘటన తరువాత ఉక్రెయిన్ మహిళ కూడా కమ్యూనికేషన్ నిలిపేసింది. వృద్దుడు నగదు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలు అన్నీ భారత్ వే నని, అదంతా సైబర్ నేరగాళ్లు(cyber criminals) ఆడిన డ్రామా అని పోలీసులు తేల్చారు.

ఇది కూడా చదవండి: Eggs: కోడిగుడ్డు పెంకు రంగుల్లో ఎందుకింత తేడా..? ఒక్కొక్కటీ ఒక్కో రంగులో ఎందుకు ఉంటాయంటే..!


Updated Date - 2023-11-10T16:18:35+05:30 IST