Samantha: తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్న సామ్

ABN , First Publish Date - 2023-02-03T20:28:56+05:30 IST

సామ్ ఈ అనారోగ్యం నుంచి కోలుకోని ప్రస్తుతం వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ‘శాకుంతలం’ (Shaakuntalam) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కనిపించారు.

Samantha: తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్న సామ్

హీరోయిన్ సమంత (Samantha) మయోసైటిస్ బారిన పడిన సంగతి తెలిసిందే. సామ్ ఈ అనారోగ్యం నుంచి కోలుకోని ప్రస్తుతం వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ‘శాకుంతలం’ (Shaakuntalam) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కనిపించారు. తాజాగా ‘సిటాడెల్’ (Citadel) వెబ్‌సిరీస్‌ను పట్టాలెక్కించారు. ‘సిటాడెల్’ టీమ్‌తో జరిపిన చర్చలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. జనవరి నెల మొత్తం తనకు బిజీగా గడిచిందని పేర్కొన్నారు. తనకు తాను ధైర్యం చెప్పుకున్నారు. ఓ ఆసక్తికర పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నెటిజన్స్‌తో పంచుకున్నారు.

‘‘గట్టిగా ఊపరి పీల్చుకో పాప. నువ్వు త్వరలోనే కోలుకుంటావు. ఏడు, ఎనిమిది నెలలు క్లిష్టమైన పరిస్థితులను చూశావు. వాటన్నింటిని ఎదుర్కొన్నావు. ఎప్పుడు కూడా వాటిని మర్చిపోకు. ఈ అడ్డంకులను ఏ విధంగా అధిగమించావో గుర్తుంచుకో. ఆలోచించడం మానేశావు.. దేనిపైనా దృష్టిపెట్టలేకపోయావు.. సరిగ్గా నడవలేకపోయావు.. అయినప్పటికీ ధైర్యంగా ముందడుగేశావు. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. నువ్వు కూడా నాలాగే గర్వపడు. ధైర్యంగా మరింత ముందుకు సాగిపో’’ అని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌కు అనేక మంది స్పందించారు. ‘సిటాడెల్’ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే.. ‘‘జనవరి చాల బిజీగా గడిచింది’’ అని కామెంట్ చేశారు. సామ్ స్నేహితులు రాహుల్ రవీంద్రన్ ‘‘ఛాంపియన్’’ అని ప్రశంసించారు. రుహాని శర్మ ‘ధైర్యవంతమైన మహిళ’ అని కొనియాడారు.

Updated Date - 2023-02-03T20:47:02+05:30 IST