Shaakuntalam: వాయిదా పడిన సమంత మూవీ విడుదల.. చింతిస్తున్నామంటూ..

ABN , First Publish Date - 2023-02-07T14:26:38+05:30 IST

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం మంచి జోష్ మీద ఉంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ సినిమాలు వరుస సినిమాలు చేస్తోంది.

Shaakuntalam: వాయిదా పడిన సమంత మూవీ విడుదల.. చింతిస్తున్నామంటూ..
Shaakuntalam

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం మంచి జోష్ మీద ఉంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ సినిమాలు వరుస సినిమాలు చేస్తోంది. అయితే ఈ బ్యూటీ ఇటీవలే ‘యశోద’ (Yashoda) సినిమాతో సూపర్ హిట్‌ని అందుకుంది. ఈ భామ తాజాగా నటించిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన ఈ మైథాలాజికల్‌ ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ మూవీ విడుదలని వాయిదా వేసింది మూవీ టీం. ఈ విషయాన్ని తెలుపుతూ.. నిర్మాణ సంస్థ గుణ టీమ్ వర్క్స్ సోషల్ మీడియాలో పోస్ట్‌ని షేర్ చేసింది.

samantha.jpg

అందులో.. ‘శాకుంతలం చిత్రాన్ని ఫిబ్రవరి 17న విడుదల చేయలేమని మా ప్రియమైన ప్రేక్షకులకు తెలియజేయడానికి చింతిస్తున్నాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. మీ నిరంతర మద్దతు, ప్రేమకు ధన్యవాదాలు’ అని మూవీ టీం విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో రాసుకొచ్చింది. ఈ మూవీలో దేవ్ మోహన్, మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్‌తో పాటు పలువురు ప్రముఖులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా.. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు మూవీ టీం సిద్ధమవుతోంది.

Updated Date - 2023-02-07T14:26:56+05:30 IST