Viral Video: నెదర్లాండ్స్‌లోని ఈ రివర్స్ బ్రిడ్జ్‌ను చూస్తే ఔరా అనాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2023-01-01T15:32:08+05:30 IST

ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. వాటిని చూస్తే ఆ ఇంజనీరింగ్ నైపుణ్యానికి అబ్బురపడక తప్పదు. అలాంటి అద్భుత నిర్మాణాలలో ఒకటి నెదర్లాండ్స్‌లోని రివర్స్ బ్రిడ్జ్. ఆ కట్టడం ఎంతో మందిని ఆకట్టుకుంటోంది.

Viral Video: నెదర్లాండ్స్‌లోని ఈ రివర్స్ బ్రిడ్జ్‌ను చూస్తే ఔరా అనాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో!

ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. వాటిని చూస్తే ఆ ఇంజనీరింగ్ నైపుణ్యానికి అబ్బురపడక తప్పదు. అలాంటి అద్భుత నిర్మాణాలలో ఒకటి నెదర్లాండ్స్‌లోని (Netherlands) రివర్స్ బ్రిడ్జ్. ఆ కట్టడం ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. తాజాగా Alvin Foo అనే ట్విటర్ యూజర్ ఆ బ్రిడ్జ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో (Viral Video) చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

ఆ వీడియోలో.. వాహనాలన్నీ ఓ బ్రిడ్జ్‌పై నుంచి వెళుతున్నాయి. ఆ బ్రిడ్జ్‌కు మధ్యలో నీళ్లు ఉన్నాయి. వాహనాలన్నీ ఆ నీళ్ల దగ్గరకు వచ్చి మాయమైపోతున్నాయి. తర్వాత బ్రిడ్జ్ మరోవైపు నుంచి వస్తూ కనిపిస్తున్నాయి. విషయమేంటంటే.. ఆ బ్రిడ్జ్‌ మధ్యలో కొంత భాగాన్ని నీళ్ల కింద నుంచి నిర్మించారు (Reverse bridge of the Netherlands). అందువల్ల ఆ బ్రిడ్జ్ ప్రపంచపు అద్భుతపు నిర్మాణాలలో ఒకటిగా నిలిచింది. ట్విటర్‌లో షేర్ అయిన ఈ వీడియో ఇప్పటివరకు 84 లక్షల వ్యూస్ సాధించింది.

Updated Date - 2023-01-01T15:33:13+05:30 IST