Janhvi Kapoor: జాన్వీ ఎవరికి భయపడుతోంది.. ఫ్యాషన్‌ పోలీస్‌ ఎవరు?

ABN , First Publish Date - 2023-03-05T19:37:52+05:30 IST

అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌కు కొత్త తలనొప్పి వచ్చింది. ఫ్యాషన్‌ పోలీస్‌ వల్ల ఆమె విసిగిపోయింది. జాన్వీ సమస్యను తెలుసుకున్న రానా రంగంలోకి దిగి ఆమెకు అండగా నిలిచి సమస్యను తీర్చారు. ఇంతకీ జాన్వికి వచ్చిన ఇబ్బంది ఏంటి?

Janhvi Kapoor: జాన్వీ ఎవరికి భయపడుతోంది.. ఫ్యాషన్‌ పోలీస్‌ ఎవరు?

అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌కు(Janhvi Kapoor) కొత్త తలనొప్పి వచ్చింది. ఫ్యాషన్‌ పోలీస్‌ వల్ల ఆమె విసిగిపోయింది. జాన్వీ సమస్యను తెలుసుకున్న రానా రంగంలోకి దిగి ఆమెకు అండగా నిలిచి సమస్యను తీర్చారు. ఇంతకీ జాన్వికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆమెకు రానా ఎందుకు సాయం చేశారు? అసలు ఈ ఫ్యాషన్‌ పోలీస్‌ ఎవరు? తెలుసుకోవాలంటే ‘రానా నాయుడు’ సిరీస్‌ చూడాల్సిందే! ( Rana naidu Series)

రానా(Venkatesh-Rana) - వెంకటేశ్‌ కీలక పాత్రల్లో నటించిన యాక్షన్‌, క్రైమ్‌ ఎంటర్‌టైనర్‌ ‘రానా నాయుడు’(Rana naidu) ఈ నెల 10న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ర్టీమింగ్‌ కానుంది. వెంకటేశ్‌ నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ఇది. ఇందులో రానా సెలబ్రిటీల సమస్యలు తీర్చే వ్యక్తిగా కనిపిస్తారు. ఈ నేపథ్యంలోనే ‘రానా నాయుడు’ ప్రమోషన్స్‌లో కొంతమంది సెలబ్రిటీలతో టీమ్‌ స్పెషల్‌ వీడియో ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగా జాన్వీకపూర్‌, రానాపై చిత్రీకరించిన ఓ వీడియోను తాజాగా విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్‌. వెంకటేశ్‌ ఈ వీడియోను ట్విట్టర్‌ వేదికగా విడుదల చేశారు. (Rana naidu on 10th in netflix)

ట్రెండ్‌కు అనుగుణంగా సెలబ్రిటీలు దుస్తులు ధరిస్తున్నారో లేదో చెప్పే ఊహాజనిత బృందం ఫ్యాషన్‌ పోలీస్‌. వారితో విసిగిపోయిన జాన్వి రానాను సంప్రదించినట్లు ఈ వీడియోలో చూపించారు. ‘మీ సమస్య ఏమిటి? చెప్పండి’ అని రానా అడగ్గా.. ‘సర్‌, పోలీసులు నా వెంట పడుతున్నారు’ అని ఆమె బదులిస్తుంది. ‘ఢిల్లీ పోలీసా ముంబయి పోలీసా? గోవా పోలీసా? పుణె పోలీసా?’ అని ఆయన ప్రశ్నించగా.. ‘లేదు సర్‌. ఫ్యాషన్‌ పోలీస్‌.. (Fasion police)ఇప్పటికే ఎన్నో రకాల ట్రెండ్స్‌ ప్రయత్నించినప్పటికీ.. ఎయిర్‌పోర్ట్‌లో నేను కనిపించగానే ఫ్యాషన్‌ పోలీస్‌ నా వెంట పడుతోంది’ అంటూ తన ఇబ్బందిని చెప్పుకొచ్చింది. అక్కడి నుంచి వెళ్లిన రానా ఒక వ్యక్తిని కిడ్నాప్‌ చేసి సమస్యను పరిష్కరించారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఈ తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే!

Updated Date - 2023-03-05T19:37:52+05:30 IST