5వ తరగతి మాత్రమే చదివిన ఈమె ఏడాదికి రూ.40 లక్షలు సంపాదిస్తోందంటే నమ్మలేకపోతున్నారా..? అసలు ఈమె చేసే పనేంటంటే..

ABN , First Publish Date - 2023-03-03T15:13:29+05:30 IST

ఐదో తరగతితోనే చదువు మానేసిన ఈమె ఏడాదికి ఏకంగా రూ.40 లక్షలు సంపాదిస్తోంది. పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఈమె కథ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది

5వ తరగతి మాత్రమే చదివిన ఈమె ఏడాదికి రూ.40 లక్షలు సంపాదిస్తోందంటే నమ్మలేకపోతున్నారా..? అసలు ఈమె చేసే పనేంటంటే..

ధనవంతులు కావడానికి, లక్షలు సంపాదించడానికి తప్పనిసరిగా చదువు ఉండాలనే నిబంధనేమీ లేదు. నిజానికి ఎక్కువ చదువుకోని వారే కోటీశ్వరులు అయిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారి జాబితాలోకి ఈ గ్రామీణ మహిళను కూడా తప్పనిసరిగా చేర్చాల్సిందే. ఐదో తరగతితోనే చదువు మానేసిన ఈమె ఏడాదికి ఏకంగా రూ.40 లక్షలు సంపాదిస్తోంది. పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఈమె కథ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది (Inspirational Story).

రాజస్థాన్‌లోని (Rajasthan) సికార్ జిల్లా బేరి గ్రామానికి చెందిన సంతోష్ దేవి ఖేదర్ (Santosh Devi Khedar) అనే మహిళ కేవలం తన ఐదెకరాల పొలంలో వ్యవసాయం (Farming) చేసి ఏడాదికి రూ.40 లక్షలు సంపాదిస్తోంది. బేరి గ్రామంలోని భూగర్భ జలాలు పడిపోవడం వల్ల భూములు వ్యవసాయానికి పనికి రాకుండా పోయాయి. ఎంతో మంది వ్యవసాయాలను వదిలేసి పట్టణాలకు వలస వెళ్లిపోయారు. సంతోష్ దేవి మాత్రం ఆ భూమిలోనే ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. 2008లో భర్త రామ్‌కరణ్‌తో కలిసి ఉద్యానవన పంటలు ప్రారంభించింది. ఇద్దరూ ఆ భూమిని చదును చేశారు. తమ దగ్గర ఉన్న గేదెను అమ్మేసి యాపిల్, దానిమ్మతో పాటు ఇతర పండ్ల మొక్కలను కొని వేశారు. ఆ మొక్కలను పెంచేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. నీటి కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. సేంద్రీయ వ్యవసాయం (Drip Irrigation) చేసి ప్రతి మొక్కకు నీరందించారు. చివరకు వారి కష్టం ఫలించింది.

Shocking Video: బాబోయ్.. ఆ పెళ్లి చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే.. కట్నంగా వధువు బరువుకు సమానమైన గోల్డ్‌.. నిజమేంటంటే..

మొక్కలకు వేసే ఎరువును వారిద్దరూ స్వయంగా తయారు చేసుకున్నారు. తమ పొలంలో మూలికా ఎరువు, పంచామృతం, జీవామృతం సిద్ధం చేసుకున్నారు. దానిమ్మ (Pomegranate) మొక్కలు నీరు లేకపోయినా పెరుగుతాయి. కరువును తట్టుకోగలవు. అందుకే పెద్ద మొత్తంలో దానిమ్మ మొక్కలను వేశారు. డ్రిప్ ఇరిగేషన్‌తో తోటలో సేద్యానికి ఏర్పాట్లు చేశారు. ఈ పద్ధతిలో 40 శాతానికి పైగా నీరు ఆదా అవుతుంది. మూడు సంవత్సరాల పాటు దానిమ్మ మొక్కలను చిన్నపిల్లల్లా చూసుకునేవారు. 2011లో తొలి కాపు వచ్చింది. 300 టన్నుల దానిమ్మ పండింది. మొదటి పంటలో రూ.25 లక్షల లాభం వచ్చింది.

తొలి ప్రయత్నంలోనే మంచి లాభాలు రావడంతో సంతోష్, రాంకరణ్‌లు మరింత కష్టపడ్డారు. దాంతో దిగుబడి మరింత పెరిగింది. ప్రస్తుతం వారి పొలం నుంచి దానిమ్మలను ప్యాక్ చేసి రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా, గుజరాత్‌, ఢిల్లీ, మహారాష్ట్రలోని వివిధ నగరాలకు పంపిస్తున్నట్లు సంతోష్‌ తెలిపారు. అలాగే దేశం నలుమూలల నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా తరచూ ఆ ఫామ్ దగ్గరకు వచ్చి పరిశోధనలు చేస్తుంటారు. ఏడాదికి రూ.40 లక్షలు సంపాదన వస్తోంది.

Updated Date - 2023-03-03T15:13:29+05:30 IST