Rahul Ravindran: ఆ సినిమా లైఫ్‌ని.. వైఫ్‌ని ఇచ్చింది!

ABN , First Publish Date - 2023-02-13T15:31:46+05:30 IST

రాహుల్‌ రవీంద్రన్‌ - చిన్మయి దంపతులకు టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ క్యూట్‌ పెయిర్‌గా గుర్తింపు ఉంది. ఇప్పుడు వారిద్దరూ భార్యభర్తలు కావచ్చు.. ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులు కావచ్చు. పదకొండేళ్ల క్రితం ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులు.

Rahul Ravindran: ఆ సినిమా లైఫ్‌ని.. వైఫ్‌ని ఇచ్చింది!

రాహుల్‌ రవీంద్రన్‌ (Rahul ravindran) - చిన్మయి (chinmayi sripada)దంపతులకు టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ క్యూట్‌ పెయిర్‌గా గుర్తింపు ఉంది. ఇప్పుడు వారిద్దరూ భార్యభర్తలు కావచ్చు.. ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులు కావచ్చు. పదకొండేళ్ల క్రితం ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులు. చెన్నైలోని ఓ డబ్బింగ్‌ స్టూడియో వారిద్దరి పరిచయానికి వేదికైంది. అప్పటికే చిన్మయి స్టార్‌ సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌. రాహుల్‌ రవీంద్రన్‌ ‘అందాల రాక్షసి’ (andala rakshasi) సినిమా చేస్తూ, లావణ్యకు చెప్పే విషయంలో దర్శకుడి హనూ రాఘవపూడితో చర్చ వచ్చినప్పుడు చిన్మయి డబ్బింగ్‌ చెబుతుందనే ప్రస్తావన వచ్చింది. చెన్నైలో ‘అందాల రాక్షసి’ స్ర్కీనింగ్‌ జరిగినప్పుడు మొదటిసారి చిన్మయిని కలిశారు రాహుల్‌. (Rahul ravindram chinmayi love story)

తదుపరి సినిమా నచ్చిందంటూ రాహుల్‌ని ట్యాగ్‌ చేసి ఓ ట్వీట్‌ వేశారు (Rahul ravindran tweet viral) చిన్మయి. అలా మొదలైన పరిచయం ట్విట్టర్‌లో డైరెక్ట్‌ మెసేజ్‌లు, తర్వాత వాట్సాప్‌ చాటింగ్‌ వరకూ వెళ్లింది. కలిసిన కాసేపట్లోనే ఫోన్‌ నంబర్లు తీసుకున్నాం. కానీ ప్రేమలో పడటానికి చాలానే సమయం పట్టింది. అలా మొదలైన ప్రయాణం.. ప్రేమ, పెళ్లి వరకూ తీసుకొచ్చింది. పదకొండేళ్ల కిందటి జ్ఞాపకాలను సరదాగా గుర్తు చేసుకున్నారు రాహుల్‌ రవీంద్రన్‌. ట్విట్టర్‌లో డైరెక్ట్‌ మెసెజ్‌ చేయడం నుంచి ఎలా ఒకటయ్యారు అనేది ట్విట్టర్‌ వేదికగా చెప్పుకొచ్చారు. అప్పటి మెసెజ్‌లను పోస్ట్‌ చేశారు.

56.jpg

‘‘ట్విట్టర్‌లో డీఎంలో అన్‌ రొమాంటిక్‌ టాపిక్స్‌, సీరియస్‌ డస్కర్షన్‌ తర్వాత జాగ్రత్తగా ఆలోచించి చిన్మయికి ఓ మెసేజ్‌ చేశాను. అలా కొన్ని మెసేజ్‌ల తర్వాత నా అభిప్రాయాన్ని చెప్పి ‘మీరు నన్ను షూట్‌ చేయనని మాటిస్తే.. మిమ్మల్ని డిన్నర్‌ లేదా కాఫీ తీసుకెళ్లాలనుంది’ అన్నది చెప్పాను. అందుకు ఆమె ‘నేను గన్‌ చేతిలో పెట్టుకుని తిరగను అండ్‌ ష్యూర్‌’’ అని బదులు ఇచ్చింది. అయితే ఆమె నుంచి రిప్లై వచ్చే వరకూ నా గుండె సీటు బెల్ట్‌ లేకుండా ఫార్ములా వన్‌ కారులాగా పరుగు తీసింది. అ సమయంలో నా పక్కన ఎవరన్నా ఉంటే నా పరిస్థితి అర్థమయ్యేది. క్షణాల్లోనే ఫోన్‌ నంబర్లు మార్చుకున్న మేము వివాహబంధంతో ఒకటయ్యాం. 11 ఏళ్ల తర్వాత మాకు ఇద్దరు పిల్లలు సంతానం కలిగింది. నాలుగు పప్పీలున్నాయి. మేమిద్దరం కలిసి కొత్త జీవితాన్ని నిర్మించుకున్నాం’’ అని రాహుల్‌ రవీంద్రన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ట్వీట్లు వైరల్‌ అవుతున్నాయి. అందాల రాక్షసి లైఫ్‌ని, వైఫ్‌ని ఇచ్చిందని రాహుల్‌ తరచూ చెబుతుంటారు. రాహుల్‌ అలాంటి భర్త దొరకడం అదృష్టం అని చిన్మయి చెబుతుంటారు. హీరోగా కెరీర్‌ ప్రారంభించిన రాహుల్‌ దర్శకుడిగా కూడా సత్తా చాటారు. ‘చిలసౌ’, మన్మథుడు 2 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Updated Date - 2023-02-13T15:49:25+05:30 IST