కీచక టీచర్.. స్కూల్‌లో బాలికలతో కలిసి పోర్న్ సినిమాలు చూస్తున్న ఉపాధ్యాయుడు.. చివరకు..

ABN , First Publish Date - 2023-01-10T15:12:27+05:30 IST

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ఉపాధ్యాయుడు పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించాడు. పాఠశాలలో పాఠాలు బోధించకుండా బాలికలతో కలిసి పోర్న్ సినిమాలు చూసేవాడు.. ఒక విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేశాడు..

కీచక టీచర్.. స్కూల్‌లో బాలికలతో కలిసి పోర్న్ సినిమాలు చూస్తున్న ఉపాధ్యాయుడు.. చివరకు..

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ఉపాధ్యాయుడు (School Teacher Harasses girl students) పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించాడు. పాఠశాలలో పాఠాలు బోధించకుండా బాలికలతో కలిసి పోర్న్ సినిమాలు చూసేవాడు.. ఒక విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేశాడు.. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు.. బాధిత బాలిక కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చింది.. దీంతో కోర్టు ఆ ఉపాధ్యాయుడికి ఆరేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది (Sexual Harassment).

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) గుణలో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ప్రదీప్ సోలంకి.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. తరగతి గదిలో ఎప్పుడూ అశ్లీలంగా పునరుత్పత్తి పాఠాలను మాత్రమే బోధించేవాడు. బాలికలకు తన మొబైల్‌లోని పోర్న్ చిత్రాలు చూపించేవాడు. ఒక బాలికపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో బాలికలు డిసెంబర్ 22, 2021న వార్డెన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో టీచర్‌పై వార్డెన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో చట్టం, జేజే చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ విషయంపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా విచారణ చేపట్టింది.

అనంతరం కోర్టులో విచారణ సందర్భంగా ఓ విద్యార్థిని వాంగ్మూలం కూడా ఇచ్చింది. విద్యార్థి వాంగ్మూలాలు, ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ కోర్టు తన తీర్పును వెలువరించింది. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద నిందితుడికి 6 ఏళ్ల శిక్ష విధించింది. అలాగే లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. అప్పీల్ వ్యవధి తర్వాత, నిందితుడు జరిమానాను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బును విద్యార్థినులకు పరిహారంగా అందజేస్తారు.

Updated Date - 2023-01-10T15:12:29+05:30 IST