ProjectK : గ్లోబల్‌ ప్రాజెక్ట్‌కి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

ABN , First Publish Date - 2023-02-18T12:45:15+05:30 IST

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ విడుదల తేదీ ఖరారైంది. మహాశివరాత్రి సందర్భంగా వైజయంతీ మూవీస్‌ సంస్థ ట్విట్టర్‌ వేదికగా రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది

ProjectK : గ్లోబల్‌ ప్రాజెక్ట్‌కి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

ప్రభాస్‌ (prabhas)హీరోగా నటిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ (Project k)విడుదల తేదీ ఖరారైంది. మహాశివరాత్రి సందర్భంగా వైజయంతీ మూవీస్‌ సంస్థ ట్విట్టర్‌ వేదికగా రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాను విడుదల చేయబోతునట్లు చెబుతూ ఆసక్తికర పోస్టర్‌ను విడుదల చేశారు. ( Project k new poster) పోస్టర్‌లో ఎడారిలో భారీ చేతిని ముగ్గురు వ్యక్తులు చూస్తున్న దృశ్యం ఆసక్తికరంగా ఉంది. ప్రాజెక్ట్‌ కె’కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ రావడం లేదని నిరాశ చెందుతున్న అభిమానులు ఈ అప్‌డేట్‌తో ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. దీపికా పడుకోన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అత్యాధునిక హంగులతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. (Project k for next Sankranthi)

Updated Date - 2023-02-18T12:50:49+05:30 IST