Prank gone Wrong: ఫ్రాంక్ చేయబోయి అడ్డంగా బుక్కయిన యువతి.. ఓ వ్యక్తి చేతిలోని ఫోన్‌ను చోరీ చేస్తున్నట్టు నటించింది కానీ..!
ABN , First Publish Date - 2023-06-22T17:35:38+05:30 IST
ఇప్పట్లో ఏ సోషల్ మీడియా ఫ్లాట్ పామ్ ఓపెన్ చేసినా ఫ్రాంక్ లకు సంబంధించిన వీడియోలు చాలా కనిపిస్తాయి. యువతీయువకులు అందరూ ఈ ఫ్రాంక్ వీడియోల పట్ల చాలా క్రేజీగా ఉంటున్నారు. ఓ యువతి ఇలాగే ఫ్రాంక్ వీడియో చేయబోయి..
ఇప్పట్లో ఏ సోషల్ మీడియా ఫ్లాట్ పామ్ ఓపెన్ చేసినా ఫ్రాంక్ లకు సంబంధించిన వీడియోలు చాలా కనిపిస్తాయి. యువతీయువకులు అందరూ ఈ ఫ్రాంక్ వీడియోల పట్ల చాలా క్రేజీగా ఉంటున్నారు. ఓ యువతి ఓ వ్యక్తి చేతిలో ఫోన్ లాక్కుని ఫ్రాంక్ చేయాలని అనుకుంది. అతని చేతిలో ఫోన్ లాక్కుని పారిపోతున్నట్టు నటించింది. కానీ తరువాత ఆమె అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది మరొకటి. ఊహించని ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
ఇతరులను ఆటపట్టించడం చాలామందికి సరదా.. ఈ సరదాలో భాగంగా చాలామంది చిలిపి పనులు చేస్తుంటారు. ఇతరుల వస్తువులు ఎత్తుకుపోవడం, బురిడీ కొట్టించడం,డ్రామా క్రియేట్ చేసి నటించడం ఇవన్నీ ఫ్రాంక్(prank) కిందకు వస్తాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఓపెన్ చేస్తే చాలు ఈ ఫ్రాంక్ వీడియోలు దర్శనమిస్తాయి(prank videos in social media). ఓ యువతి(women) ఇలాగే తన స్నేహితురాలితో కలసి ఫ్రాంక్ వీడియో చేయాలని అనుకుంది. ఆమె ఎస్కలేటర్(Escalator) పై కిందకు వెళుతోంది. పక్కనే పైకి వస్తున్నవారు ఉన్నారు. వారిలో ఓ వ్యక్తి మొబైల్ చేతుల్లో(mobile in a man hand) పట్టుకుని చాలా సీరియస్ గా మొబైల్ ఆపరేట్ చేస్తున్నాడు. ఫ్రాంక్ చేయాలనుకున్న యువతి ఆ వ్యక్తి చేతుల్లో నుండి మొబైల్ లాక్కుని పారిపోతున్నట్టు నటించింది(women theft the mobile and ran away). అయితే తన చేతుల్లో మొబైల్ లాక్కోగానే ఆ వ్యక్తి చురుగ్గా ఆలోచించాడు. వెంటనే వీడియో తీస్తున్న అమ్మాయి చేతిలో మొబైల్ లాక్కున్నాడు. దీంతో అమ్మాయిలు షాకయ్యారు. అతనలా చేస్తాడని ఆ అమ్మాయిలు అస్సలు ఈహించలేదు. దీంతో అమ్మాయిలు తమ మొబైల్ కోసం కంగారుగా అబ్బాయి దగ్గరకు పరుగులు పెడతారు. ఈ క్రమంలో మొబైల్ లాక్కున్న వ్యక్తి కెమెరా వైపు చూసి నవ్వుతూ కెమెరా ఆఫ్ చేశాడు.
4 Tasks in June: పాన్, ఆధార్ లింక్ మాత్రమే కాదండోయ్.. జూన్ నెలలోనే తప్పకుండా చేయాల్సిన 4 ముఖ్యమైన పనులివీ..!
ఈ వీడియో NO CONTEXT HUMANS అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 'అది ఎక్స్చేంచ్ గిఫ్ట్' అని ఒకరు కామెంట్ చేశారు. 'అమ్మాయిలు ఫ్రాంక్ వీడియో మంచి కుర్రాడిమీదే ట్రై చేశారు' అని అంటున్నారు. 'అతను చాలా తెలివైనవాడు' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'తక్షణ కర్మఫలితం అంటే ఇదే' అని మరొకరు అన్నారు.