Viral: అతడికి 70 ఏళ్లు.. ఆమెకు 28 ఏళ్లు.. గుడిలో రహస్యంగా పెళ్లి.. మరో ట్విస్ట్ ఏమిటంటే..

ABN , First Publish Date - 2023-01-26T23:00:30+05:30 IST

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటో ప్రస్తుతం ఉత్తర‌ప్రదేశ్‌లో పెద్ద చర్చకే తెర తీసింది. అది ఓ జంట పెళ్లికి సంబంధించిన ఫొటో అన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Viral: అతడికి 70 ఏళ్లు.. ఆమెకు 28 ఏళ్లు.. గుడిలో రహస్యంగా పెళ్లి.. మరో ట్విస్ట్ ఏమిటంటే..

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటో ప్రస్తుతం ఉత్తర‌ప్రదేశ్‌లో పెద్ద చర్చకే తెర తీసింది. అది ఓ జంట పెళ్లికి సంబంధించిన ఫొటో అన్నట్టు ప్రచారం జరుగుతోంది. వరుడి వయసు 70 ఏళ్లు కాగా.. వధువు వయసు జస్ట్ 28. ఫొటో చూసిన స్థానికులు.. వధువు వరుడికి కోడలవుతుందని గుర్తుపట్టి నోరెళ్లబెడుతున్నారు.

గోరఖ్‌పూర్ జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బర్హల్‌గంజ్ పోలీస్టేషన్ పరిధిలోని ఛపియా ఉమ్రావ్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల కైలాశ్ యాదవ్ స్థానికంగా వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటారు. ఆయనకు నలుగురు కుమారులు. భార్య పన్నెండేళ్ల క్రితం మరణించారు. కాగా.. కొంత కాలం కిందట కైలాశ్ యాదవ్ మూడో కుమారుడు కూడా మరణించాడు. దీంతో.. కోడలు పూజకు ఆయన మరో వివాహం జరిపించారు. కానీ.. కొంతకాలం తరువాత ఆమె తన రెండో భర్తను వదిలిపెట్టి కైలాశ్ యాదవ్ ఇంటికి వచ్చేసింది. అప్పటి నుంచీ ఆ కుటుంబంతోనే నివసిస్తోంది. ఇలాంటి టైంలో కైలాశ్, పూజ పెళ్లి చేసుకున్నట్టున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది. దీనిపై స్థానికుల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. విషయం మీడియా దృష్టికి కూడా వెళ్లింది. దీని గురించి కొందరు కైలాశ్ కుటుంబసభ్యుల వద్ద ప్రస్తావించినా వారు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. దీంతో.. ఈ ఫొటో స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-01-26T23:45:58+05:30 IST