Pawan kalyan: పార్టీ పెట్టిన రోజు నుంచి అదే ఆలోచన!

ABN , First Publish Date - 2023-02-10T19:46:25+05:30 IST

‘నాకు అధికారమున్నా, లేకున్నా ప్రజల్లో చైతన్యం వచ్చే దిశగా అడుగులు వేయాలంటే నేనే రాజకీయ పార్టీ పెటాలనుకున్నా. పార్టీ పెట్టిన రోజు నుంచి అదే ఆలోచనలో ఉన్నా. ఆదిపత్య ధోరణి నడుస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో అధికారం అందరికీ అందాలి అన్నదే నా ఆలోచన’’ అని పవన్‌కల్యాణ్‌ (pawan kalyan)అన్నారు.

Pawan kalyan: పార్టీ పెట్టిన రోజు నుంచి అదే ఆలోచన!

‘‘నాకు అధికారమున్నా, లేకున్నా ప్రజల్లో చైతన్యం వచ్చే దిశగా అడుగులు వేయాలంటే నేనే రాజకీయ పార్టీ పెటాలనుకున్నా. పార్టీ పెట్టిన రోజు నుంచి అదే ఆలోచనలో ఉన్నా. ఆదిపత్య ధోరణి నడుస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో అధికారం అందరికీ అందాలి అన్నదే నా ఆలోచన’’ అని పవన్‌కల్యాణ్‌ (pawan kalyan)అన్నారు. ‘ఆహా’ ఓటీటీలో టెలికాస్ట్‌ అయిన ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2’లో పవన్‌కల్యాణ్‌ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (Unstoppable with nbk)

రాబోవు తరాల వారికి, అధికారం రాని సమూహాలకు సాధికారిత ఇచ్చే దిశగా నేను నడవాలంటే ఇప్పటికే ఫామ్‌లో ఉన్న పార్టీల్లో చేరడం కరెక్ట్‌ (Kalyan opens up about his battle with depression) కాదనిపించింది. ఆ పార్టీలకు సిద్థాంతాలు, లక్ష్యాలు ఉన్నాయి. వారితో చేరితే నా భావాలను ఎంతవరకూ బయటకు తీసుకెళ్లగలను అన్నది సందేహం. అందుకే నాకంటూ కొన్ని మూల సిద్ధాంతాలు పెట్టుకున్నా. అందరూ గెలుపు దిశగా, లక్ష్యంగా ముందుకెళ్తారు. అధికారం లేకపోతే ఏం చేయలేం అనుకుంటారు. కానీ నేను అధికారం లేకపోయినా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే దిశగా వెళ్లాలంటే ఎవరితో సంబంధం లేకుండా ఉండాలన్నది నా నియమం. ఎంతో టాలెంట్‌ ఉన్న యువత విదేశాలకు ఎందుకు వెళ్లాలి. కరెక్ట్‌ పొలిటికల్‌ అట్మాస్పియర్‌ లేకపోవడమే ప్రతిభ గల యువత వలసలు వెళ్లిపోతున్నారని నా భావన. అలాంటి అట్మాస్పియర్‌ తీసుకురావాలని నా ఆకాంక్ష. (Pawan kalyan about politics)

చనిపోవాలనుకున్నది అందుకే...

చిన్నప్పటి నుంచి ఆస్తమా, జ్వరం బాగా ఉండేవి. ఆరు, ఏడో తరగతుల్లో ఆరోగ్యం సవ్యంగా ఉండేది కాదు. సరైన స్నేహితుల్లేక ఇంటిపట్టునే ఉండేవాణ్ణి. పుస్తకాలే ేస్నహితులిగా గడిపాను. స్కూల్‌, కాలేజ్‌కి వెళ్లడం ఇబ్బందిగా అన్పించేది. పరీక్షల ఒత్తిడి నచ్చేది కాదు. ఆ క్రమంలో టీచర్లు నచ్చేవాళ్లు కాదు. సెల్ఫ్‌ లెర్నింగ్‌లో ముందుకెళ్లా. ేస్నహితులంతా చక్కగా చదువుకుని, క్రికెట్‌లో రాణిస్తుంటే నేను పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయా. అదొకలాంటి బాధ కలిగేది. ఇంటర్‌ సమయంలో అంటే 17 ఏళ్ల వయసులో మానసికంగా కుంగిపోయా. చనిపోతే బాగుండు అన్పించింది. నా వల్ల ఎవరికీ ఏ ఉపయోగం లేదు.. నేనుఎవరికీ ఏం చేయలేకపోతున్నాను అన్న భావన బాగా ఉండేది. బాగా డిప్రెషన్‌లో ఉండేవాణ్ణి. ఎవరూ లేని సమయంలో అన్నయ్య గదిలో ఉన్న లైసెన్స్‌ రివాల్వర్‌ తీసుకుని కాల్చుకుందామనుకున్నా. ఒక నెల పాటు బాగా ఆలోచించా. అన్నయ్య షూటింగ్‌కి వెళ్తే పిస్టల్‌తో కాల్చేసుకుందామని డిసైడ్‌ అయ్యి కూర్చున్న. ముభావంగా ఉంటున్న నన్ను గమనించిన వదిన సురేఖ, నాగబాబు అన్నయ్య గమనించి ఎందుకలా ఉన్నావని అడిగారు. నాకు తెలియకుండానే కాల్చేకుందాం అనుకుంటున్నా అనేశా. వదిన్న నాగబాబు అన్నయ్య వచ్చి నన్ను పట్టేసుకున్నారు. అప్పుడు అన్నయ్య దగ్గరికి తీసుకెళ్తారు. ‘నువ్వు చదవకపోయాని ఫర్వాలేదు.. బతికి ఉండరా’ అని చెప్పారు. ఆ సందర్భం నన్ను సేవ్‌ చేసింది. ఈ విషయాలు ఎవరితోనూ షేర్‌ చేసుకోలేదు. సినిమా అనేది నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చింది. సూపర్‌స్టార్‌డమ్‌ వస్తుందని అనుకోలేదు’’ అని చెప్పారు.

Updated Date - 2023-02-10T19:46:26+05:30 IST