online gambling market: కరోనా కాలం నుంచి ఉవ్వెత్తున పెరిగిన ఆ వ్యాపారం... వైద్యం కాదు... మరేమిటో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-03-25T09:05:08+05:30 IST

కరోనా మహమ్మారి(Corona epidemic) సమయంలో ఆన్‌లైన్ జూదం, ఆన్‌లైన్ బెట్టింగ్‌(Online betting)పై క్రేజ్ గణనీయంగా పెరిగింది.

online gambling market: కరోనా కాలం నుంచి ఉవ్వెత్తున పెరిగిన ఆ వ్యాపారం... వైద్యం కాదు... మరేమిటో తెలిస్తే...

కరోనా మహమ్మారి(Corona epidemic) సమయంలో ఆన్‌లైన్ జూదం, ఆన్‌లైన్ బెట్టింగ్‌(Online betting)పై క్రేజ్ గణనీయంగా పెరిగింది. భారత్‌లోనూ ఆన్‌లైన్ బెట్టింగ్ మార్కెట్ జోరందుకుంది. ఫాంటసీ క్రికెట్, ఆన్‌లైన్ రమ్మీ(Online Rummy), పోకర్, తీన్ పత్తీ, ఫెయిర్ ప్లే తదితర ఎన్నో జూదం ప్లాట్‌ఫారమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా మహమ్మారి భారతదేశం(India)లో బెట్టింగ్ ఆధారిత ఆన్‌లైన్ గేమింగ్‌కు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. విశ్లేషకుల అంచనా ప్రకారం 2.4 కోట్ల (24 మిలియన్లు)కు మించిన భారతీయులు గేమింగ్ మార్కెట్లో భాగస్వాములయ్యారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (World Economic Forum) తెలిపిన వివరాల ప్రకారం భారతదేశ గేమింగ్ పరిశ్రమ(gaming industry) వృద్ధికి స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడమే ప్రధాన కారణం. స్మార్ట్‌ఫోన్‌ల వాడకం గేమింగ్ పరిశ్రమ వృద్ధిని మరింత వేగవంతం చేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌(Online betting)కు సంబంధించిన చాలా ఆటలను స్మార్ట్‌ఫోన్‌లలో ఆడుతుంటారు. ఇంటిలో ఇంటర్నెట్(Internet) సదుపాయం, గేమింగ్ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు ఈ మార్కెట్‌కు ఆజ్యం పోశాయి. గత ఏడాది ఏప్రిల్ 1న కాంగ్రెస్ ఎంపీ డీన్ కురియాకోస్(MP Dean Kuriakos) ఆన్‌లైన్ గేమింగ్ (నియంత్రణ) బిల్లు, 2022ను ప్రవేశపెట్టారు. 2022 సంవత్సరంలో భారతదేశంలో దాదాపు 42 కోట్ల మంది యాక్టివ్ ఆన్‌లైన్ గేమర్‌లు(Online gamers) ఉన్నారని ఆయన తెలిపారు.

2021 సంవత్సరంలో దాదాపు 39 కోట్ల (390 మిలియన్లు) యాక్టివ్ గేమర్‌లు, 2020లో 36 కోట్లమంది, 2019లో 30 కోట్లమంది (300 మిలియన్లు) ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. భారతీయ ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ ప్రతి సంవత్సరం 30 శాతం చొప్పున అభివృద్ధి(Development) చెందుతోంది. 2025 నాటికి ఇది 5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(Federation of Indian Chambers of Commerce and Industry) వెల్లడించిన నివేదిక ప్రకారం, భారతదేశంలో లావాదేవీ ఆధారిత గేమ్‌ల ఆదాయంలో 26% వృద్ధి నమోదయ్యింది.

Updated Date - 2023-03-25T11:00:17+05:30 IST