Controversy: ఈ తెలుగు నిర్మాతకి జేమ్స్ కెమరూన్ తెలియదట, ఆడుకుంటున్న నెటిజన్స్

ABN , First Publish Date - 2023-01-17T13:30:18+05:30 IST

నాగవంశీ కి వార్తల్లో ఉండటం ఇష్టంగా ఉందేమో కానీ, ఎక్కువ వివాదాస్పదమయిన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు

Controversy: ఈ తెలుగు నిర్మాతకి జేమ్స్ కెమరూన్ తెలియదట, ఆడుకుంటున్న నెటిజన్స్

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తక్కువ కాలంలో పెద్ద స్టార్ తో సినిమాలు తీసే సంస్థల్లో సితార ఎంటర్ టైన్ మెంట్ (Sithara Entertainment) ఒకటి. సూర్యదేవర రాధాకృష్ణ (Suryadevara Radhakrishna) దీనికి అధినేత అయితే, అతని బ్రదర్ కుమారుడు నాగవంశీ (Suryadevara Nagavamsi) ఇప్పుడు ఈ సంస్థని చూసుకుంటున్నాడు. నాగవంశీ కి వార్తల్లో ఉండటం ఇష్టంగా ఉందేమో కానీ, ఎక్కువ వివాదాస్పదమయిన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు (He always comes up with controversial remarks). అయితే ఇతనికి ఈమధ్య చాలా ఆటిట్యూడ్ కూడా వచ్చిందని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. ఎందుకంటే, ఇతని వెనకాల త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) వున్నారని, అతను కూడా ఈ సితార ఎంటర్ టైన్ మెంట్ తో చేతులు కలిపి సినిమాలు తీస్తూ ఉండటం, అలాగే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), అల్లు అర్జున్ (Allu Arjun)లాంటి పెద్ద స్టార్స్ తో సినిమాలు తీయటం, ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) తో కూడా ఇంకో సినిమా చేస్తూ ఉండటం, పరిశ్రమలో ఇతనే పెద్ద నిర్మాత అని అనుకుంటూ ఉంటాడు అని ఒక టాక్ నడుస్తోంది.

bheemla.jpg

ఇదంతా ఎందుకు అంటే, ఈమధ్య అతను అవతార్ (Avatar 2) సినిమా గురించి ఒక ట్వీట్ చేసాడు. అది తనకి నచ్చలేదని. అదే విషయం, యాంకర్ సుమ మొన్నీమధ్య ఒక ఇంటర్వ్యూ లో అడిగితే, "ఎవరో హాలీవుడ్ లో జేమ్స్ కెమరూన్ (James Cameroon) అని మనకి తెలియని మనిషి సినిమా తీస్తే నాకు నచ్చలేదని చెపితే అది కూడా ఎక్స్ ప్రెస్ చెయ్యకూడదా," అని చెప్పాడు సమాధానం. జేమ్స్ కెమరూన్ తెలియకపోవటం ఏంటి? (Some person like James Cameroon even we don't know him and he made a film called Avatar and I didn't like it, that's my opinion, says Naga Vamsi) అవతార్ సినిమా గురించి తెలియకపోవటం ఏంటి? తెలియకుండానే సినిమా చూసాడా నాగవంశీ అని అడుగుతున్నారు నెటిజన్స్. అయితే నాగవంశీ సమాధానం కి కాదు, ఒక నిర్మాతగా అతను చెప్పే విధానం, తీరు నచ్చలేదు అని దెప్పి పొడుస్తున్నారు సాంఘీక మాధ్యమాల్లో.

అప్పుడెప్పుడో ట్వీట్ చేసినందుకే నాగ వంశి ని ట్రోల్ చేసారు, మళ్ళీ ఇప్పుడు ఈ సుమ ఇంటర్వ్యూ చేసాక, మళ్ళీ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నాడు. (Netizens trolled Naga Vamsi for his comment about Avatar 2 and James Cameroon) ఇప్పుడు తెలుగు సినిమా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. ఒక నిర్మాతగా నాగ వంశీ, జేమ్స్ కెమరూన్ ఎవరో తెలియదు, అవతార్ సినిమా గురించి ఆలా వ్యాఖ్య చెయ్యటం అతని ఆటిట్యూడ్ కి నిదర్శనం అంటున్నారు నెటిజన్స్. ఎందుకంటే తెలుగు సినిమాలకి ఇప్పుడు విదేశాల్లో కూడా మంచి గిరాకీ వుంది, అలంటి అప్పుడు పెద్ద సినిమాలు తీసే నాగవంశీ కి ఇలాంటి సినిమాల గురించి, అవి ఎవరు తీశారో కూడా తెలియకపోవటం నిజంగా దురదృష్టకరం అని అంటున్నారు నెటిజన్స్.

djtillu.jpg

మొదట తెలీదు అన్న ఈ నిర్మాత తరువాత సర్దుకుంటూ ఈ సినిమా మీద చాల ఎక్సెపెక్టేష‌న్స్‌తో వెళ్లిన నాకు ఆ రేంజ్‌లో క‌నెక్ట్ కాలేదు అని చెప్పారు. వెంటనే సుమ ఈ సినిమా ఒక విజువ‌ల్ ట్రీట్ క‌దా అని చెప్పింది, దానికి కూడా విజువ‌ల్ ట్రీట్ అంటే గంట‌, గంట‌న్న‌రో అయితే ఓకే కానీ 3 గంట‌లు విజువ‌ల్స్ మీద‌నే అదీ 3డి గ్లాస్ తో కళ్ళు నొప్పి వచ్చాయి అని చెప్పాడు వంశీ. ఇదే కాదు, నాగ వంశీ ఇంతకు ముందు కూడా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. 'భీమ్లా నాయక్' (Bheemla Nayak) విడుదల ఎప్పుడు అంటే, జగన్ (YS Jagan) గారిని అడగండి అనీ, అలాగే 'డి.జె. టిల్లు' (DJ Tillu) మీ బయోపిక్ సినేమానా అంటే, "ఇంత అందమయిన అమ్మాయిని ముద్దుపెట్టుకోవాల్సి వస్తే మనమే యాక్ట్ చేస్తాం" అని ఏవేవో చెప్పాడు. ఇద్దరు పెద్ద స్టార్ లతో ఓ మూడు సినిమాలు చేస్తేనే ఇంత ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు, ఇంకా ఇంతకన్నా పెద్ద పెద్ద సినిమాలు కొన్ని దశాబ్దాలపాటు చేస్తున్న నిర్మాతలు మరి ఎంత చూపించాలి? కానీ వాళ్ళందరూ చాల ఒద్దికగా వుంటారు, వాళ్ళని చూసి అయినా నాగవంశీ నేర్చుకుంటే మంచిది అని పరిశ్రమలో అంటున్నారు. (Earlier also Naga Vamsi made some controversial remarks about Bheemla Nayak and DJ Tillu film)

Updated Date - 2023-01-17T13:30:18+05:30 IST