Nammayatri: ఓఎన్‌డీసీతో ‘నమ్మయాత్రి’ ఒప్పందం

ABN , First Publish Date - 2023-03-24T12:00:27+05:30 IST

బెంగళూరులో అనతి కాలంలోనే వేలాది మంది ప్రయాణాలకు అనుకూలంగా మారిన నమ్మయాత్రి(Nammayatri) సేవలు మరింత విస్తృతమయ్యాయి.

Nammayatri: ఓఎన్‌డీసీతో ‘నమ్మయాత్రి’ ఒప్పందం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి) : బెంగళూరులో అనతి కాలంలోనే వేలాది మంది ప్రయాణాలకు అనుకూలంగా మారిన నమ్మయాత్రి(Nammayatri) సేవలు మరింత విస్తృతమయ్యాయి. ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌(ఓఎన్‌డీసీ)తో నమ్మయాత్రి ఒప్పందం చేసుకుంది. గురువారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓఎన్‌డీసీ సీఈఓ టి.కోషి నమ్మయాత్రి వ్యవస్థాపక సీఈఓ విమల్‌ కుమార్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ఓఎన్‌డీసీ సీఈఓ కోషి మాట్లాడుతూ నమ్మయాత్రి మా నెట్‌వర్క్‌లోకి చేరడం సంతోషంగా ఉందన్నారు. ఓఎన్‌డీసీ ద్వారా రవాణాతో పాటు ఇతరత్రా సేవలు పొందేందుకు వీలుందన్నారు. రవాణా సేవలను డిజటలీకరణ చేసే విధంలో తమ పరిధి పెరిగినట్లు అయ్యిందన్నారు. విమల్‌కుమార్‌ మాట్లాడుతూ బెంగళూరు నెట్‌వర్క్‌(Bangalore Network)గా ఆరంభమైన నమ్మ యాత్రికు ప్రజాధరణ పెరుగుతోందన్నారు. 45495ల మంది డ్రైవర్‌లు ఉన్నారని ప్రతి రోజు కనీసంగా 15468 ట్రిప్పులు సాధ్యమవుతున్నాయన్నారు. నెట్‌వర్క్‌ విస్తరించుకునేందుకు ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నామన్నారు. మధ్యవర్తులు లేకుండానే ప్రయాణీకుడు వాహన డ్రైవర్‌ ద్వారా సేవలు పొందేందుకు వీలుందన్నారు. 4.5లక్షల మంది వినియోగదారులు, 5.17లక్షల సార్లు సేవలు పొందారన్నారు. బెంగళూరులో ట్రాఫిక్‌ ద్వారా తలెత్తే సమస్యలను కొంతమేరనైనా తగ్గించాలనే నమ్మయాత్రి ప్రారంభించామన్నారు. జస్‌పే సీఈఓ విమల్‌కుమార్‌ మాట్లాడుతూ అభివృద్ది చెందుతున్న నగరాలలో రవాణా సౌలభ్యాలు మరింత అనుకూలం చేసేందుకు కీలక నిర్ణయం జరిగిందన్నారు.

Updated Date - 2023-03-24T12:00:27+05:30 IST