Shadows Of Hiroshima: హఠాత్తుగా అణుబాంబు దాడి జరిగిన చోట 77 ఏళ్లుగా చెరగని నీడ.. ‘మనిషిని అంతం చేసినా ‘గుర్తు’ను అంతం చేయలేకపోయారంటూ...

ABN , First Publish Date - 2023-03-14T09:30:57+05:30 IST

Shadows Of Hiroshima: ప్రపంచంలో మర్మమైన విషయాలు అనేకం ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. అటువంటిదే ఒక రహస్యమైన నీడ(A mysterious shadow) ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. గత 77 ఏళ్లుగా ఈ నీడ ఎవరిదో ప్రపంచానికి(world) కూడా తెలియదు.

Shadows Of Hiroshima: హఠాత్తుగా అణుబాంబు దాడి జరిగిన చోట 77 ఏళ్లుగా చెరగని నీడ.. ‘మనిషిని అంతం చేసినా ‘గుర్తు’ను అంతం చేయలేకపోయారంటూ...

Shadows Of Hiroshima: ప్రపంచంలో మర్మమైన విషయాలు అనేకం ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. అటువంటిదే ఒక రహస్యమైన నీడ(A mysterious shadow) ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. గత 77 ఏళ్లుగా ఈ నీడ ఎవరిదో ప్రపంచానికి(world) కూడా తెలియదు. జపాన్‌లోని హిరోషిమా.. ఇది ప్రపంచంలోనే మొదటి అణు బాంబు(atomic bomb)ను జారవిడిచిన నగరం. ఈ చారిత్రాత్మక సంఘటన(historical event) 1945 ఆగస్ట్ 6న జరిగింది. ఈ బాంబును అమెరికా(America) వేసింది. అది మొదలు ఈ నగరంలో ఒక ప్రదేశంలో మనిషిలా కనిపించే ఒక నీడ ఏర్పడింది.

77 ఏళ్లు గడిచినా నేటికీ అది ఎవరి నీడనో ఎవరూ గుర్తించలేకపోయారు. ఈ నీడను 'ది హిరోషిమా స్టెప్స్ షాడో' లేదా 'షాడోస్ ఆఫ్ హిరోషిమా' అని పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా(Hiroshima)పై అణుదాడి చేసినప్పుడు రెప్పపాటు కాలంలో లక్షలాది మంది చనిపోయారు. నీడకు సంబంధించిన ఈ గుర్తు పేలుడు జరిగిన ప్రదేశం నుండి 850 అడుగుల దూరంలో ఉంది.

2582.jpg

అణుబాంబు(Atomic bomb) అక్కడ కూర్చున్న వ్యక్తిని నాశనం చేసిందని, కానీ అతని నీడ(shadow)ను చెరిపివేయలేకపోయిందని చెబుతారు. అయితే బాంబు వేసే సమయంలో అక్కడ కూర్చున్న వ్యక్తి(sitting person) ఎవరో నేటికీ గుర్తించలేకపోయారు. ఇది ఇప్పటి వరకు మిస్టరీగానే నిలిచింది. ఒక అంచనా ప్రకారం హిరోషిమాపై జరిగిన అణుదాడిలో సుమారు ఒక లక్షా 40 వేల మంది(40 thousand people) మరణించారు. పేలుడు కారణంగా వెలువడిన శబ్ధం, వేడి కారణంగా 80 వేల మంది మరణించారని చెబుతారు.

అనంతరం న్యూక్లియర్ రేడియేషన్(Nuclear radiation) సంబంధిత వ్యాధుల కారణంగా వేలాది మంది మరణించారు. హిరోషిమాపై వేసిన అణుబాంబు పేరు 'లిటిల్ బాయ్'(Little Boy). దీని బరువు దాదాపు 4400 కిలోలు. దాని విస్ఫోటనం(eruption) కారణంగా 4,000 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి ఉద్భవించింది. కాగా మనిషి శరీరం(human body) 50 నుండి 55 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే వేడిని తట్టుకోగలదు. అణు బాంబు నుంచి ఇంత అధిక ఉష్ణోగ్రత(temperature) వెలువడటంతో అత్యధిక సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2023-03-14T09:40:13+05:30 IST