The Kerala Story: కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడు ప్రియురాలిపై ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2023-05-23T10:48:15+05:30 IST

అచ్చు సినిమా స్టోరీని తలపించేలా ఇండోర్ నగరంలో జరిగిన ఘటన సంచలనం రేపింది. ది కేరళ స్టోరీ సినిమా చూసి అచ్చు సినిమాలో లాగా తన ప్రియురాలిపై అత్యాచారం చేసి, మతం మారాలని ఒత్తిడి చేసిన ప్రియుడి ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో వెలుగుచూసింది...

The Kerala Story: కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడు ప్రియురాలిపై ఏం చేశాడంటే...
The Kerala Story

ఇండోర్ (మధ్యప్రదేశ్): అచ్చు సినిమా స్టోరీని తలపించేలా ఇండోర్ నగరంలో జరిగిన ఘటన సంచలనం రేపింది. ది కేరళ స్టోరీ సినిమా చూసి అచ్చు సినిమాలో లాగా తన ప్రియురాలిపై అత్యాచారం చేసి, మతం మారాలని ఒత్తిడి చేసిన ప్రియుడి ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో వెలుగుచూసింది.ది కేరళ స్టోరీ(The Kerala Story) సినిమా చూసిన ఇండోర్ నగరానికి చెందిన 23 ఏళ్ల యువకుడు తన లివింగ్ భాగస్వామి అయిన ప్రియురాలిపై(Girlfriend) అత్యాచారం చేసి, ఆమెను మతం మారాలని ఒత్తిడి చేశాడు.(Forcing her to Convert) ది కేరళ స్టోరీ సినిమా చూసిన తర్వాత ప్రేయసీ, ప్రియుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆ ప్రియురాలు ప్రియుడిపై కేసు పెట్టింది.

దీంతో .బలవంతంగా అత్యాచారం చేయడమే కాకుండా మత మార్పిడిని నిషేధించే మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం 2021, ఇండియన్ పీనల్ కోడ్ నిబంధనల ప్రకారం యువకుడిపై కేసు పెట్టి అతన్ని అరెస్టు చేసినట్లు ఖజ్రానా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ దినేష్ వర్మ చెప్పారు. తాను , తన ప్రియుడు ఇటీవల ది కేరళ స్టోరీ సినిమా చూసినట్లు మహిళ చెప్పింది. సినిమా చూసిన తర్వాత ఇద్దరూ వాదించుకున్నారు. దీంతో తన ప్రియుడు తనపై దాడి చేసి విడిచిపెట్టాడని మే 19వతేదీన పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

ఇది కూడా చదవండి : Ranchi: రిమ్స్‌లో మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది...

నిందితుడు 12వ తరగతి ఉత్తీర్ణుడై నిరుద్యోగి కాగా, బాధితురాలు ఉన్నత విద్యావంతురాలు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. నాలుగేళ్ల క్రితం ఓ కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న సమయంలో సదరు యువకుడితో మహిళకు పరిచయం ఏర్పడిందని పోలీసు అధికారి తెలిపారు.అన్ని ఆరోపణలపై క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నామని ఎస్ఐ దినేష్ వర్మ తెలిపారు.

Updated Date - 2023-05-23T10:48:15+05:30 IST