Shocking: 18 ఏళ్ల కుర్రాడితో ముగ్గురు పిల్లల తల్లి ప్రేమ వ్యవహారం.. అందరినీ వదిలేసి ఇంట్లోంచి ఎస్కేప్.. చివరకు ఏమైందంటే..!
ABN , First Publish Date - 2023-11-06T21:06:34+05:30 IST
ముగ్గురు పిల్లలున్న వివాహిత ఓ 18 ఏళ్ల యువకుడిని ప్రేమించి అతడితో వెళ్లిపోయిన ఘటన బీహార్‌లో గోపాల్ గంజ్ జిల్లాలో వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఓ యువకుడు మరో మహిళ ముగ్గురు పిల్లలతో కలిసి వీధిలో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇంతలో కొందరు అక్కడికి అకస్మాత్తుగా ఊడిపడి అతడిని పబ్లిక్‌గా నిలదీశారు. ఇంతలో మరికొందరు వచ్చి మహిళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది క్షణాల తరువాత స్థానికులకు అసలు విషయం అర్థమై నివ్వెరపోయారు. బీహార్(Bihar) జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
NRI: గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాదారులకు భారీ ఊరట
Viral Video: బాబోయ్..భీముడు మళ్లీ పుట్టాడా? పుట్టిన వెంటనే ఈ నవజాత శిశువు చేసిన పనికి నర్సు షాక్!
గోపాల్ గంజ్ జిల్లా కేంద్రంలో ఓ మహిళ తన పుట్టింట్లో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. ఆమె భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో మహిళను తన ఇంటి సమీపంలో ఉండే ఓ 18 ఏళ్ల యువకుడితో సాన్నిహిత్యం ఏర్పడింది. అతడు తన కంటే చిన్నవాడైనా ఆమె అతడిపై మనసు పారేసుకుంది. అక్కడి నుంచి తమ బంధం గురించి ఎవరికీ తెలీకుండా వారిద్దరూ జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో తాము ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని నిర్ధారించుకున్న వారు ఎవరికీ చెప్పకుండా మరో చోటుకి వెళ్లిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు.
ఇటీవల యువకుడు మరో ప్రాంతంలో వ్యాపారం ప్రారంభించడానికి వెళుతున్నానని చెప్పి గడప దాటాడు. ఆ తరువాత కనీసం కుటుంబసభ్యులకు కూడా ఫోన్‌లో అందుబాటులో లేకుండా పోయాడు. మరోవైపు, మహిళ కూడా తన ముగ్గురు పిల్లలతో సహా అదృశ్యమైపోయింది(Mother of 3 runs away with 18 year old man gets caught). వారి మధ్య సంబంధం గురించి తెలీన ఇరు కుటుంబాల వారూ పోలీసులను ఆశ్రయించారు.
Viral: ఈ సింహానికి ఏమైంది? నడిరోడ్డు మీద ఊహించని విధంగా.. వీడియో చూసి షాకైపోతున్న జనాలు!
ఇదిలా ఉంటే ఇటీవల ఓ రోజు ఆ యువకుడు మహిళ ఆమె పిల్లలతో కలిసి వెళుతూ తెలిసిన వారి కంటపడ్డారు. వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో యువకుడిని రోడ్డు మీద రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీశారు. ఈ విషయం మహిళ కుటుంబానికీ తెలీసి వారూ అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. ఈ పంచాయతీ చివరకు పోలీసుల వద్దకు చేరింది. ఈ విషయంలో చేసేదేం లేకపోవడంతో వారు రెండు కుటుంబాలను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. అయితే, ఈ ఘటన స్థానికంగా పెను కలకలానికి దారి తీసింది.