Most Valued Celebrity: ఆకాశాన్ని తాకుతున్న ఆ సెలబ్రిటీల బ్రాండ్ విలువ... జాబితాలో అల్లు అర్జున్, రష్మిక ఎక్కడున్నారంటే...

ABN , First Publish Date - 2023-03-23T11:27:12+05:30 IST

Most Valued Celebrity: ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్(Ranveer Singh) బ్రాండ్ విలువ పరంగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)ని అధిగమించాడు.

Most Valued Celebrity: ఆకాశాన్ని తాకుతున్న ఆ సెలబ్రిటీల బ్రాండ్ విలువ... జాబితాలో అల్లు అర్జున్, రష్మిక ఎక్కడున్నారంటే...

Most Valued Celebrity: ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్(Ranveer Singh) బ్రాండ్ విలువ పరంగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)ని అధిగమించాడు. అతను అత్యంత 'విలువైన భారతీయ సెలబ్రిటీ'గా మారాడు. కార్పొరేట్ ఇన్వెస్టిగేషన్ అండ్ రిస్క్ కన్సల్టింగ్(Corporate Investigation and Risk Consulting) సంస్థ క్రోల్ 2022 నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ దేశంలో అత్యధిక బ్రాండ్ విలువ(Brand value)ను కలిగి ఉన్నాడు. ఇది $ 181.7 మిలియన్లని అంచనా.

ఈ జాబితాలో రెండో స్థానంలో భారత క్రికెట్ జట్టు(Indian cricket team) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు ఉంది. ఈ నివేదిక(Report) ప్రకారం విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ 176.9 మిలియన్ డాలర్లుగా అంచనా. 2020 సంవత్సరంలో కోహ్లీ భారత జట్టు(Indian team)కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు, అతని బ్రాండ్ విలువ 237 మిలియన్ డాలర్లు. 2021 సంవత్సరంలో ఇది $ 185.7 మిలియన్లకు తగ్గింది. ఈ జాబితాలో అక్షయ్ కుమార్(Akshay Kumar) మూడో స్థానంలో ఉన్నాడు.

అతని బ్రాండ్ విలువ $153.6 మిలియన్లు. అలియా భట్(Alia Bhatt) నాలుగో స్థానంలో ఉంది. ఆమె బ్రాండ్ విలువ $102.9 మిలియన్లు. ఈ జాబితాలో దీపికా పదుకొనె ఐదో స్థానంలో ఉంది. ఆమె బ్రాండ్ విలువ 82.9 మిలియన్ డాలర్లు. దీపికాతో పాటు హృతిక్ రోషన్(Hrithik Roshan), అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ పేర్లు కూడా టాప్ 10 లిస్టులో ఉన్నాయి. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni) పేరు 6వ స్థానంలో ఉంది. అతని బ్రాండ్ విలువ 80 మిలియన్లు. ఇక సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) పేరు 8వ స్థానంలో ఉంది. అతని బ్రాండ్ విలువ $73.6 మిలియన్లు. దక్షిణాది నటులు అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న టాప్ 25 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా(Neeraj Chopra), కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత పీవీ సింధు పేర్లు కూడా టాప్ 25 జాబితాలో ఉన్నాయి.

Updated Date - 2023-03-23T11:34:33+05:30 IST