Mangala Mukhi: ఏం ఐడియా గురూ.. ఇంట్లో పురుషుడు .. వీధిలో మంగళముఖి

ABN , First Publish Date - 2023-07-16T12:24:46+05:30 IST

జీవనం సాగించేందుకు నిస్సహాయ స్థితిలో ఉండేవారు చేయి చాచి బిచ్చమెత్తుతారు. కానీ బెంగళూరు(Bengaluru)లో ఒక వ్యక్తి విలాసవంతంగా జీవిం

Mangala Mukhi: ఏం ఐడియా గురూ.. ఇంట్లో పురుషుడు .. వీధిలో మంగళముఖి

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): జీవనం సాగించేందుకు నిస్సహాయ స్థితిలో ఉండేవారు చేయి చాచి బిచ్చమెత్తుతారు. కానీ బెంగళూరు(Bengaluru)లో ఒక వ్యక్తి విలాసవంతంగా జీవించేందుకు కొత్త నాటకం ఆడిన సంఘటన గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు గుర్తించి అసలుగుట్టు రట్టు చేసి బాగలగుంటె పోలీసులకు అప్పగించారు. ఇంట్లో పురుషుడిగా ఉంటూ... బయట మంగళముఖి(Mangala Mukhi)లా కొనసాగుతుండేవాడు. చేతన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబసభ్యులకు తానేం చేస్తు న్నాడో తెలియకుండా ఉండేందుకు బాగలగుంటె పరిధిలో వేరుగా గదిని అద్దెకు తీసుకున్నాడు. ఇంటినుంచి సాధారణ వ్యక్తిగా బయటకు వచ్చే చేతన్‌... ప్రత్యేక గదికి చేరుకుని వేషం మార్చేవాడు. అక్కడనుంచి నాగసంద్ర మెట్రో స్టేషన్‌(Nagasandra Metro Station)కు చేరుకుని మంగళముఖిగా భిక్షాటన చేసేవాడు. ఎవరైనా బిచ్చం ఇవ్వకుంటే తోటి వారిని తీసుకొస్తానంటూ బెదరించేవాడు. నాగసంద్ర మెట్రో స్టేషన్‌ సమీపంలో అక్రమంగా ఓ షెడ్‌ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశాడు. స్థానికులు బీఎంఆర్‌సీఎల్‌ అధికారులు షెడ్‌ను తొలగించేందుకు అక్కడికి చేరుకున్నాడు. అధి కారులపై చేతన్‌ వీరంగం చేశాడు. స్థానిక మహిళ ఒకరు తోపులాటలో చీరను లాగేయడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. షెడ్‌ను తొలగించడంతోపాటు బాగలగుంటెలోని ప్రత్యేక గదిని పోలీసులు పరిశీలించారు. అనంతరం జ్యుడీషియల్‌ కస్టడీకి పంపారు.

pandu4.jpg

Updated Date - 2023-07-16T12:26:39+05:30 IST