Share News

Viral Video: దెబ్బకు బుద్ధి వచ్చింది.. కొండచిలువతో ఆటలు ఆడితే అలాగే ఉంటుంది.. వీడియో వైరల్!

ABN , Publish Date - Dec 30 , 2023 | 09:43 PM

ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో పాములు కూడా ఒకటి. పాము కాటు పడిందంటే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. పాములంటే చాలా మంది భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే చాలు.. అటువైపు వెళ్లడానికి కూడా భయపడతారు.

Viral Video: దెబ్బకు బుద్ధి వచ్చింది.. కొండచిలువతో ఆటలు ఆడితే అలాగే ఉంటుంది.. వీడియో వైరల్!

ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో పాములు (Snakes) కూడా ఒకటి. పాము కాటు పడిందంటే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. పాములంటే చాలా మంది భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే చాలు.. అటువైపు వెళ్లడానికి కూడా భయపడతారు. ఇక, కొండ చిలువను (Python) చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. తాజాగా ఓ వ్యక్తి ఓ కొండచిలువతో ఆటలాడు అందుకు తగిన మూల్యం చెల్లించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).

therealtarzann అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి తన చేతులతో కొండచిలువను పట్టుకుని దానితో ఆటలాడుతున్నాడు. అతడి తీరు చూస్తుంటే అతడు నిపుణుడు కాదని అర్థమవుతోంది. అయినా అతడు కొండచిలువను ధైర్యంగా పట్టుకున్నాడు. దాని తలపై ముద్దాడడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో కొండచిలువ అతడి మొహాన్ని కొరికేసింది. ఆ కొండ చిలువ దంతాలు ఆ వ్యక్తి చెంపలో ఇరుక్కున్నాయి (Python Video).

ఆ కొండ చిలువ నుంచి తప్పించుకోవడానికి ఆ వ్యక్తి చాలా ప్రయత్నించాడు. చివరకు కొన్ని సెకన్ల తర్వాత, ఆ కొండచిలువను లాగి కింద పడేశాడు. అతని ముఖం నుంచి రక్తం చుక్కలు కారడం ఆ వీడియోలో కనిపించింది. ఈ వైరల్ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు. 12 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.

Updated Date - Dec 30 , 2023 | 09:43 PM