Viral: టైమ్ బాంబ్ అంటూ హెచ్చరించిన డాక్టర్.. దెబ్బకు 165 కిలోల బరువు తగ్గిన వ్యక్తి.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-03-12T19:29:09+05:30 IST

ప్రస్తుత సమాజంలో ఆహార నియామాలు తప్పిపోవడం, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పెరిగిపోవడం వంటి కారణాల వల్ల ఊబకాయం (Over weight), మధుమేహం (Diabetes) వంటి లైఫ్ స్టైల్ రోగాలు ఎక్కువైపోయాయి.

Viral: టైమ్ బాంబ్ అంటూ హెచ్చరించిన డాక్టర్.. దెబ్బకు 165 కిలోల బరువు తగ్గిన వ్యక్తి.. అసలేం జరిగిందంటే..

ప్రస్తుత సమాజంలో ఆహార నియామాలు తప్పిపోవడం, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పెరిగిపోవడం వంటి కారణాల వల్ల ఊబకాయం (Over weight), మధుమేహం (Diabetes) వంటి లైఫ్ స్టైల్ రోగాలు ఎక్కువైపోయాయి. పెరిగిన బరువును తగ్గించుకునేందుకు ఎంతో మంది నానా కష్టాలు పడుతున్నారు. పెరిగిన బరువును తగ్గించుకోవడం ఏమంత సులభం కాదు. అయితే డాక్టర చెప్పిన ఓ మాటకు భయపడిన అమెరికా వ్యక్తి ఏకంగా 165 కిలోల బరువు తగ్గి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

అమెరికాకు చెందిన నికోలస్‌ క్రాఫ్ట్‌ (Nicholas Craft) అనే వ్యక్తి 2019లో తన వెయిట్ లాస్ (Weight loss) జర్నీని ప్రారంభించాడు. 2019కి ముందు అతడు ఏకంగా 300 కిలోల బరువు ఉండేవాడు. అధిక బరువు (Obesity) కారణంగా అతడు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. ఒకరోజు హాస్పిటల్‌కు వెళితే అక్కడ డాక్టర్ చెప్పిన మాటలు నికోలస్‌కు చెమటలు పట్టించాయి. ``ప్రస్తుతం నువ్వు టైమ్‌బాంబ్‌లా ఉన్నాయి. ఏ క్షణంలోనైనా నువ్వు చనిపోవచ్చు. బరువు తగ్గించుకునేందుకు ఏదైనా చేస్తేనే బతికి బయటపడతావు. లేకపోతే మూడేళ్లు బతకడం కూడా కష్టమేన``ని డాక్టర్ హెచ్చరించాడు. దాంతో నికోలస్ బరువు తగ్గించుకునే పని మొదలుపెట్టాడు. డాక్టర్ చెప్పిన నియమాలను నాలుగేళ్లపాటు పాటించి 165 కేజీలు తగ్గి ఔరా అనిపించాడు.

Viral Video: ఏం ఎండలు రా బాబూ.. వేడి తట్టుకోలేక ఆ ఏనుగు ఎలా స్నానం చేస్తోందో చూడండి.

``అధిక బరువు వల్ల నేను ఇల్లు కదలేకపోయేవాడిని. మోకాళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, పడుక్కుంటే శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో బాధపడేవాడిని. డాక్టర్ సలహాతో డైటింగ్, వ్యాయామం ప్రారంభించాను. మా నాన్నమ్మ నాకు ఎంతో సహాయం చేసింది. నేను సన్నబడితే చూడాలనుకుంది. అయితే రెండేళ్ల ముందే ఆమె చనిపోయింది. ఏదేమైనా ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను`` అని నికోలస్ చెప్పాడు.

బంగారం పేరుతో ఎర వేశాడు.. గుడ్డిగా నమ్మిన అమ్మాయి హోటల్‌కు వెళితే అత్యాచారం చేశాడు.. ఆ తర్వాత..

Updated Date - 2023-03-12T19:29:09+05:30 IST