Share News

Shocking Twist: ఏం తెలివిరా బాబూ.. బిచ్చగాడిని చంపి.. కన్నకొడుకే చనిపోయాడని నమ్మించి రూ.80 లక్షలు కొట్టేశారు.. 17 ఏళ్ల తర్వాత..!

ABN , First Publish Date - 2023-11-10T17:06:03+05:30 IST

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మలయాళ సూపర్ హిట్ సినిమా ``కురుప్`` చూశారా? నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా మొత్తం ఇన్సూరెన్స్ డబ్బుల చుట్టూ తిరుగుతుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తనలాగానే ఉండే ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి హీరో చంపేస్తాడు.

Shocking Twist: ఏం తెలివిరా బాబూ.. బిచ్చగాడిని చంపి.. కన్నకొడుకే చనిపోయాడని నమ్మించి రూ.80 లక్షలు కొట్టేశారు.. 17 ఏళ్ల తర్వాత..!

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటించిన మలయాళ సూపర్ హిట్ సినిమా ``కురుప్`` (kurup Movie) చూశారా? నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా మొత్తం ఇన్సూరెన్స్ డబ్బుల (Insurance Money) చుట్టూ తిరుగుతుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తనలాగానే ఉండే ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి హీరో చంపేస్తాడు. అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) జరిగింది. ఓ బిచ్చగాడిని చంపి తన కొడుకే చనిపోయాడని నమ్మించి ఏకంగా రూ.80 లక్షల ఇన్సూరెన్స్ కొట్టేశాడో ఓ వ్యక్తి. చివరకు 17 ఏళ్ల తర్వాత అసలు విషయం బయటపడింది (Crime News).

ఆగ్రాలోని రకబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూలై 31, 2006న ఓ కారు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో డ్రైవర్ మంటల్లో చిక్కుకుని గుర్తు పట్టలేని విధంగా మాడిపోయాడు. ఆ మృతదేహం తన కుమారుడు అయిన అనిల్ సింగ్‌దే అని జయపాల్ సింగ్ అనే వ్యక్తి గుర్తించాడు. దీంతో పోలీసులు అనిల్ చనిపోయినట్టు సర్టిఫికెట్ ఇచ్చారు. అంతకు రెండేళ్ల ముందు అంటే 2004లో అనిల్ తన పేర రూ.80 లక్షలకు ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. దీంతో జయపాల్ సింగ్ కుటుంబానికి రూ.80 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు అందాయి. కాగా, అనిల్ సింగ్ బతికే ఉన్నాడని, రాజ్‌కుమార్ చౌదరిగా పేరు మార్చుకుని నికోల్ ప్రాంతంలో జీవిస్తున్నాడని అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది.

Shocking: పొలాల్లో చెట్ల పొదల్లో మూట.. పదే పదే కదులుతుండటంతో అటుగా వెళ్తున్న రైతుకు డౌట్.. భయపడుతూనే ఓపెన్ చేసి చూస్తే..!

ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు విచారించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే చనిపోయినట్టు నటించానని పోలీసుల ముందు అనిల్ అంగీకరించాడు. రైలులో కనిపించిన ఓ బిచ్చగాడికి ఆహారం ఇస్తామని ఆశ చూపి ఆగ్రా సమీపంలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి చంపేశామని, అతడిని కారులో కూర్చోపెట్టి ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్ చేశామని చెప్పాడు. బిచ్చగాడిని డ్రైవర్ సీటులో కూర్చోబెట్టి కారుకు నిప్పంటించామని అనిల్ చెప్పాడు. డబ్బులు అందిన తర్వాత అనిల్ తన గ్రామానికి ఎప్పుడూ వెళ్లేలేదు. తన పేరును రాజ్‌కుమార్ చౌదరిగా మార్చుకుని అదే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డును కూడా పొందాడు. చివరకు ఎవరో ఇచ్చిన సమాచారంతో పోలీసులకు దొరికిపోయాడు.

Updated Date - 2023-11-10T17:06:04+05:30 IST