Viral: నా డబ్బులు నాకు ఇచ్చెయ్.. బ్రేకప్ చెప్పిన ప్రేయసికి బెదిరింపులు.. విసిగిపోయిన ఆమె ఏం చేసిందంటే..
ABN , Publish Date - Dec 18 , 2023 | 04:06 PM
ఆమె ఓ ఎయిర్ హోస్టెస్.. విమానంలో కలిసిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది.. ఇద్దరూ సహజీవనం చేశారు.. ఒకే ఇంట్లో ఏడాది పాటు కలిసి నివసించారు.. కొన్ని రోజుల తర్వాత ఆ యువతి అతడిని వదిలేసి తన ఇంటికి వెళ్లిపోయింది..
ఆమె ఓ ఎయిర్ హోస్టెస్ (Air Hostess).. విమానంలో కలిసిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా (Love) మారింది.. ఇద్దరూ సహజీవనం చేశారు.. ఒకే ఇంట్లో ఏడాది పాటు కలిసి నివసించారు.. కొన్ని రోజుల తర్వాత ఆ యువతి అతడిని వదిలేసి తన ఇంటికి వెళ్లిపోయింది.. అయితే ఆ వ్యక్తి మాత్రం ఊరుకోలేదు.. రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు తను ఖర్చుబెట్టిన డబ్బులను తిరిగి వెనక్కి ఇవ్వమని వేధించాడు.. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది (Crime News).
గుజరాత్‌లోని గాంధీనగర్ (Gandhinagar)కు చెందిన 25 ఏళ్ల యువతి ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తోంది. 2019లో గ్వాలియర్‌కు చెందిన పాఠక్ అనే ప్రయాణికుడితో ఆమెకు పరిచయం కలిగింది. వారిద్దరి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఏడాది పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత ఆమె ఉద్యోగం మానేసి తన స్వస్థలమైన అసోంకు వెళ్లిపోయింది. ఆ క్రమంలో పాఠక్‌తో మాట్లాడ్డం మానేసింది. అయితే పాఠక్ మాత్రం ఊరుకోలేదు. ఆమెకు ఫోన్ చేసి కలిసి ఉందామని అడగుతుండేవాడు. అందుకు ఆమె నిరాకరించింది.
తనతో కలిసి ఉండకపోతే, గతంలో తను ఖర్చుబెట్టిన డబ్బులు (Money) అన్నీ తిరిగి ఇచ్చెయ్యాలని డిమాండ్ మొదలుపెట్టాడు. తరచుగా ఫోన్లు చేసి డబ్బులు అడుగుతుండేవాడు. లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. విసిగిపోయిన ఆ మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.