Share News

Husband: పాముతో ఓ భర్త పక్కా స్కెచ్.. భార్య, రెండేళ్ల కొడుకు నిద్రపోతున్న గదిలోకి సర్పాన్ని వదిలి..!

ABN , First Publish Date - 2023-11-28T20:46:05+05:30 IST

ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను, కన్న కొడుకును చంపేందుకు కిరాతకమైన ప్లాన్ వేశాడు. ఓ విష సర్పాన్ని ఇంట్లోకి వదిలి వారిద్దరినీ చంపేశాడు. తర్వాతి రోజు ఉదయం తనకేమీ తెలియనట్టు నటించాడు.

Husband: పాముతో ఓ భర్త పక్కా స్కెచ్.. భార్య, రెండేళ్ల కొడుకు నిద్రపోతున్న గదిలోకి సర్పాన్ని వదిలి..!

ఒడిశాకు (Odisha) చెందిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను, కన్న కొడుకును చంపేందుకు కిరాతకమైన ప్లాన్ వేశాడు (Husband killed wife). ఓ విష సర్పాన్ని (Snake) ఇంట్లోకి వదిలి వారిద్దరినీ చంపేశాడు. తర్వాతి రోజు ఉదయం తనకేమీ తెలియనట్టు నటించాడు. ప్రమాదవశాత్తూ పాము ఇంట్లోకి ప్రవేశించి తన భార్యను, కొడుకును కాటు వేసిందని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ వ్యక్తి మామగారు అల్లుడి పన్నాగం పసిగట్టి పోలీసులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది (Crime News).

ఒడిశాలోని గంజాం జిల్లా అధేగావ్ గ్రామ్రానికి చెందిన గణేశ్ అనే వ్యక్తికి బసంతి అనే యువతితో 2020లో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. గణేశ్‌కు అతడి భార్యతో తరచుగా గొడవలు జరుగుతుండేవి. గత నెల 6వ తేదీన ఓ వ్యక్తి నుంచి గణేశ్ ఓ పామును కొని తన భార్య, కొడుకు నిద్రిస్తున్న గదిలో వదిలాడు. ఆ పాము కాటేయడంతో బసంతి, రెండేళ్ల కొడుకు చనిపోయారు. తర్వాతి రోజు ఉదయం లేచిన తర్వాత తన భార్యను, కొడుకును పాము కాటేసినట్టు అందరికీ చెప్పాడు. తాను వేరే గదిలో పడుక్కున్నానని అందుకే బతికిపోయానని చెప్పాడు.

Panipuri: పానీ పూరీ తింటూ నవ్వడమే ఆ యువతి చేసిన తప్పయింది.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి చంపేశారు..!

గణేశ్ చెప్పింది అందరూ నమ్మేశారు. అయితే బసంతి తండ్రి మాత్రం నమ్మలేదు. తన అల్లుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. గణేశ్‌కు పామును అమ్మిన వ్యక్తిని పట్టుకుని ప్రశ్నించారు. అతడు నిజం చెప్పడంతో అసలు విషయం బయటపడింది. విచారణలో గణేశ్ తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2023-11-28T20:46:07+05:30 IST