ఈ ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఎంత మంచివారో చూడండి.. ఆయన చేసిన పనేంటో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-05-26T10:44:32+05:30 IST
ఆలయ హూండీలో పొరపాటున వేసిన బంగారు నగలు తనకు తిరిగివ్వాలని భక్తురాలు కోరగా, ఆలయ ట్రస్టీ చైర్మెన్

పెరంబూర్(చెన్నై): దిండుగల్ జిల్లా పళని మురుగన్ ఆలయ హూండీలో పొరపాటున వేసిన బంగారు నగలు తనకు తిరిగివ్వాలని భక్తురాలు కోరగా, ఆలయ ట్రస్టీ చైర్మెన్ చంద్రమోహన్ తన సొంత ఖర్చుతో కొత్త ఆభరణం చేయించి అందజేశారు. కేరళ రాష్ట్రం అలప్పులా జిల్లా పత్తియూర్‌కు చెందిన శశిధరన్ పిల్లై కుమార్తె సంగీత. గత ఏడాది సెప్టెంబరు 19న పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించుకుంది. ఆ సమయంలో భక్తి పారవశ్యంలో ఆమె తాను ధరించిన నగను పొరపాటున హుండీలో వేసింది. ఈ విషయాన్ని ఆమె ఆలయ అధికారులకు లేఖ ద్వారా తెలియజేసింది. సీసీ ఫుటేజీ పరిశీలించిన ఆలయ నిర్వాహకులు సంగీత హుండీలో నగ వేసినట్లు గుర్తించారు. చట్టప్రకారం భక్తులు హుండీల్లో వేసిన కానుకలను తిరిగిచ్చే అవకాశం లేదు. భక్తురాలి పేదరికాన్నిగుర్తించిన ఆలయ ట్రస్టీ చైర్మన్ చంద్రమోహన్, తన సొంత ఖర్చుతో రూ.1.9 లక్షల విలువైన 17.460 గ్రాముల బంగారు చైన్‌ను బుధవారం సంగీతను ఆలయానికి పిలిపించి అందజేశారు.