Lingusamy: ‘ఆవారా’ కు సీక్వెల్.. హీరో, హీరోయిన్ ఎవరంటే..?

ABN , First Publish Date - 2023-02-25T13:39:12+05:30 IST

బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘పైయ’ (Paiyaa). ఎన్. లింగుస్వామి (N. Lingusamy) దర్శకత్వం వహించారు. కార్తి (Karthi), తమన్నా (Tamannaah) హీరో, హీరోయిన్ గా నటించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించింది.

Lingusamy: ‘ఆవారా’ కు సీక్వెల్.. హీరో, హీరోయిన్ ఎవరంటే..?

బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘పైయ’ (Paiyaa). ఎన్. లింగుస్వామి (N. Lingusamy) దర్శకత్వం వహించారు. కార్తి (Karthi), తమన్నా (Tamannaah) హీరో, హీరోయిన్ గా నటించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించింది. తెలుగులోకి ‘ఆవారా’ (Awaara) టైటిల్‌తో వచ్చింది. ఈ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌ను లింగుస్వామి తెరకెక్కించనున్నట్టు కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. హీరో, హీరోయిన్ కూడా ఫిక్సయినట్టు సమాచారం అందుతుంది.

Awaara-2.jpg

లింగు‌స్వామి ‘పైయ 2’ (Paiyaa 2) స్క్రిఫ్ట్‌ను సిద్ధం చేశారు. సూర్య, కార్తి, శింబు వంటి హీరోలను కలసి కథను వినిపించారు. కానీ, వారంతా చాలా బిజీగా ఉన్నారు. దీంతో మరో కోలీవుడ్ హీరో ఆర్య (Arya) కు ఆయన స్క్రిఫ్ట్‌ను వినిపించారు. ప్రస్తుతం ఆర్య కూడా ‘ఖాదర్‌ బాషా ఎన్గిర ముత్తురామలింగం’ అనే చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ పూర్తయ్యాక ఆయన ‘పైయ 2’ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్టు వదంతులు షికార్లు కొడుతున్నాయి. హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డే (Pooja Hegde) కు సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. అయితే, ఈ మూవీలో బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించనున్నట్టు పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. కానీ,ఆమె తండ్రి బోనీ కపూర్‌ (Boney Kapoor) మాత్రం ఆ వార్తలన్నింటిని కొట్టిపారేశారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Simbu: ఎట్టకేలకు శింబు పెళ్లి.. ఎవరితోనో తెలుసా..?

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-25T13:39:13+05:30 IST