Kodaikanal: నేటినుంచి కొడైకెనాల్లో వేసవి ఉత్సవాలు
ABN , First Publish Date - 2023-05-26T08:36:24+05:30 IST
దిండుగల్ జిల్లాలో ‘క్వీన్ ఆఫ్ హిల్స్’గా ప్రసిద్ధిచెందిన కొడైకెనాల్(Kodaikanal)లో శుక్రవారం నుంచి వేసవి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

- పుష్ప ప్రదర్శనకు ముస్తాబైన బ్రయాంట్ పార్క్
ప్యారీస్(చెన్నై): దిండుగల్ జిల్లాలో ‘క్వీన్ ఆఫ్ హిల్స్’గా ప్రసిద్ధిచెందిన కొడైకెనాల్(Kodaikanal)లో శుక్రవారం నుంచి వేసవి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఆకట్టుకొనేలా బ్రయాంట్ పార్క్‌లో ప్రత్యేక అంశాలతో పుష్ప ప్రదర్శనకు ముస్తాబు చేశారు. ఉద్యానవన, పర్యాటక శాఖలు సంయుక్తంగా ఈ ఏడాది పుష్ప ప్రదర్శనను ఈ నెల 28 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. వేసవి ఉత్సవాల్లో భాగంగా పలు పోటీలు నిర్వహించనున్నారు. ఉత్తమ పుష్పాలు, పండ్లు పండించే రైతులను ప్రోత్సహించేలా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 26 తోటల యజమానులు తమ పేర్లు నమోదుచేసుకున్నారు.