Kodaikanal: కొడైకెనాల్‌లో నీటిపై తేలే ఫుట్‌పాత్‌

ABN , First Publish Date - 2023-03-17T11:14:44+05:30 IST

కొడైకెనాల్‌(Kodaikanal) జలాశయంలో పర్యాటకుల కోసం నీటిపై తేలే ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేస్తున్నారు. నగరం మధ్యలో ఉన్న ఈ జలా

Kodaikanal: కొడైకెనాల్‌లో నీటిపై తేలే ఫుట్‌పాత్‌

ఐసిఎఫ్‌(చెన్నై): కొడైకెనాల్‌(Kodaikanal) జలాశయంలో పర్యాటకుల కోసం నీటిపై తేలే ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేస్తున్నారు. నగరం మధ్యలో ఉన్న ఈ జలాశయం పరిసరాల్లో రూ.24 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.5.80 కోట్లతో కొత్త బోట్‌ హౌస్‌ నిర్మాణం, రూ.35 లక్షల వ్యయంతో నీటిపై తేలే ఆధునిక ఫుట్‌పాత్‌(Footpath)ను గాలితో నింపిన వస్తువులతో ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకులు సురక్షితంగా, సులభంగా జలాశయ అందాలు తిలకించేలా దీన్ని తీర్చిదిద్దుతున్నామని, బోట్‌ హౌస్‌ కోసం కొత్తగా 70 పడవలు కొనుగోలు చేయనున్నామని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-03-17T11:14:44+05:30 IST