Ramayana: రావణాసురుడిగా యశ్!

ABN , First Publish Date - 2023-01-28T19:36:09+05:30 IST

‘కెజియఫ్’ (KGF) ప్రాంచైజీతో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న నటుడు యశ్ (Yash). ఈ ప్రాంచైజీతో ‘రాకింగ్ స్టార్’ స్టార్‌డమ్ అమాంతం పెరిగిపోయింది. నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Ramayana: రావణాసురుడిగా యశ్!

‘కెజియఫ్’ (KGF) ప్రాంచైజీతో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న నటుడు యశ్ (Yash). ఈ ప్రాంచైజీతో ‘రాకింగ్ స్టార్’ స్టార్‌డమ్ అమాంతం పెరిగిపోయింది. నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మించి రాణించాలని యశ్ అనుకుంటున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇండస్ట్రీల నుంచి వరుసగా ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఏ కథకు ఒకే చెప్పలేదు. అయితే, యశ్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్ మాత్రం ఫిల్మ్ సర్కిల్స్‌లో విపరీతంగా షికార్లు కొడుతుంది. అదేంటంటే..

అల్లు అరవింద్ (Allu Aravind), మధు మంతెన (Madhu Mantena) రామాయణాన్ని (Ramayana) నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నితిశ్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటించనున్నారు. రావణాసురుడి పాత్ర కోసం మేకర్స్ యశ్‌ను సంప్రదించారని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. దర్శకుడు చెప్పిన కథకు రాకింగ్ స్టార్ ఫిదా అయ్యారట. నితిశ్ తివారీ ఫ్రీ విజువలైజేషన్‌కు మెస్మరైజ్ అయ్యారు. రెండు నెలల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారట. మధు మంతెన, నితిశ్ తివారీ రావణాసురుడి పాత్రకు యశ్ అయితే సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నారు. యశ్‌కు చాలా మంది దర్శకులు కథలను వినిపించారట. అందులో ఆయన ఐదింటిని ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఐదింటిలోనే రామాయణం ఒక స్క్రిఫ్ట్ అని సమాచారం. కరణ్ జోహార్ ‘బ్రహ్మాస్త్ర 2’ లో దేవ్ పాత్రను పోషించాలని యశ్‌ను గతంలో కోరారు. అందుకు ఆయన మాత్రం అంగీకారం తెలపలేదు. ఇక యశ్ విషయానికి వస్తే.. జంగిల్ అడ్వెంచర్, గ్యాంగ్ స్టర్ డ్రామా, సైన్స్ ఫిక్షన్‌తో కూడిన స్క్రిఫ్ట్స్ ఆయన వద్దకు వచ్చాయి. ఒకవేళ రావణాసురుడి పాత్రను చేయకపోతే ఈ స్క్రిఫ్ట్స్‌లో ఒకదానిని పట్టాలెక్కించే అవకాశం ఉంది.

Updated Date - 2023-01-28T19:38:57+05:30 IST