Kate Winslet: భర్త ముందే మరొకరితో శృంగార సన్నివేశాలు.. ఎలా ఫీల్ అయ్యిందో చెప్పిన టైటానిక్ బ్యూటీ

ABN , First Publish Date - 2023-02-15T15:16:50+05:30 IST

జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ‘టైటానిక్’ సినిమా చూసిన అందరికీ కేట్ విన్‌స్లేట్, లియోనార్డో డికాప్రియో తెలిసే ఉంటారు.

Kate Winslet: భర్త ముందే మరొకరితో శృంగార సన్నివేశాలు.. ఎలా ఫీల్ అయ్యిందో చెప్పిన టైటానిక్ బ్యూటీ
Kate Winslet

జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ‘టైటానిక్’ (Titanic) సినిమా చూసిన అందరికీ కేట్ విన్‌స్లేట్ (Kate Winslet), లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio) తెలిసే ఉంటారు. ఆ సినిమాలో రోజ్, జాక్‌లా వారిద్దరినీ నటనతో ప్రపంచ సినీ ప్రేమికుల హృదయాలను కదిలించారు. ఈ మూవీ తర్వాత కూడా ఆ జంట కలిసి ‘రివల్యూషనరీ రోడ్’ (Revolutionary Road) అనే మూవీలో కలిసి నటించింది. దానికి కేట్ విన్‌స్లేట్ మాజీ భర్త శ్యామ్ మెండిస్ (Sam Mendes) దర్శకత్వం వహించాడు. ఆ చిత్రంలో ఆయన ముందే పలు శృంగార సన్నివేశాల్లో కేట్ నటించాల్సి వచ్చింది. ఆ సమయంలో తను కొంచెం ఇబ్బంది పడినట్లు నటి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

కేట్ మాట్లాడుతూ.. ‘రివల్యూషనరీ రోడ్ సినిమాలో డికాప్రియోతో కలిసి రెండోసారి నటించాను. అది చాలా ఆనందంగా అనిపించింది. కానీ సినిమాకి నా భర్తే దర్శకుడు. ఆయన ముందే డికాప్రియోతో శృంగార సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. భర్త ముందే వేరే వ్యక్తితో అలాంటి సీన్లు చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. అదే సమయంలో విచిత్రంగా కూడా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో కేట్ గురించి డికాప్రియో మాట్లాడుతూ.. ఆమె చాలా ప్రోఫెషనల్ అని, తనతో నటించడం చాలా సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నాడు. కాగా.. ఈ సినిమాకి కేట్‌కి ఉత్తమ నటిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది.

ఇది కూడా చదవండి: NTR-Bhanumathi: ఒకే సినిమా.. రెండు అర్ధ శతదినోత్సవాలు

Updated Date - 2023-02-15T15:16:51+05:30 IST