Jyothika: 25ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కు రీ ఎంట్రీ!

ABN , First Publish Date - 2023-01-30T15:52:57+05:30 IST

దక్షిణాదిలోని టాలెంటెడ్ హీరోయిన్స్‌లో జ్యోతిక (Jyothika) ఒకరు. నటన ప్రాధాన్యమున్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ భామ దాదాపుగా 25ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తుంది.

Jyothika: 25ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కు రీ ఎంట్రీ!

దక్షిణాదిలోని టాలెంటెడ్ హీరోయిన్స్‌లో జ్యోతిక (Jyothika) ఒకరు. నటన ప్రాధాన్యమున్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ భామ దాదాపుగా 25ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తుంది. ఓ హిందీ చిత్రంలో నటిస్తుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

వైవిధ్య నటుడు రాజ్ కుమార్ రావ్ (Rajkummar Rao) హీరోగా నటిస్తున్న ‘శ్రీ’ (Sri) సినిమాలో ఆమె కీలక పాత్రను పోషించనుంది. చిత్ర బృందంతో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసింది. ‘‘శ్రీ చిత్రంలో నా షూటింగ్‌ను బాధకరమైన హృదయంతో పూర్తి చేశాను. నేను పనిచేసిన అద్భుతమైన టీమ్స్‌లో ఇది ఒకటి. చిత్ర దర్శకుడు తుషార్, నిర్మాత నిధికి నా కృతజ్ఞతలు. రాజ్ కుమార్ రావ్‌కు నేను పెద్ద అభిమానిని. బాలీవుడ్‌లోని బెస్ట్ నటుడితో పనిచేసినందుకు నాకు గర్వంగా ఉంది’’ అని జ్యోతిక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తన భార్య జ్యోతిక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడంతో హీరో సూర్య సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపాడు. శ్రీ సినిమాకు తుషార్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిధి పర్మార్ హీరానందిని నిర్మిస్తుంది. అలయా ఎఫ్, శరద్ ఖేల్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక తన కెరీర్‌ను హిందీ ఇండస్ట్రీలోనే ప్రారంభించింది. ప్రియదర్శన్ తెరకెక్కించిన ‘దొలీ సజా కే రక్నా’ (Doli Saja Ke Rakhna) లో నటించింది. ఈ చిత్రం 1997లో విడుదలైంది.

Updated Date - 2023-01-30T15:54:53+05:30 IST