ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భారీగా ఉద్యోగావకాశాలు... వేతనాలు ఏ స్థాయిలో ఉంటాయంటే...

ABN , First Publish Date - 2023-03-21T09:52:42+05:30 IST

Artificial Intelligence: భారతదేశంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి సంబంధించి 45,000 ఉద్యోగ అవకాశాలు(Job Opportunities) తగిన అభ్యర్థుల కోసం ఎదురు చూస్తున్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భారీగా ఉద్యోగావకాశాలు... వేతనాలు ఏ స్థాయిలో ఉంటాయంటే...

Artificial Intelligence: భారతదేశంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి సంబంధించి 45,000 ఉద్యోగ అవకాశాలు(Job Opportunities) తగిన అభ్యర్థుల కోసం ఎదురు చూస్తున్నాయి. డేటా సైంటిస్టులు(Data scientists), మెషిన్ లెర్నింగ్ (ML) ఇంజనీర్లు(Engineers) ఈ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. పలు పరిశ్రమలలో AI సామర్థ్యాన్ని విశ్లేషించిన టీమ్‌లీజ్ డిజిటల్ అనే టెక్ స్టాఫింగ్ కంపెనీ తన నివేదిక(Report)లో ఈ వివరాలు వెల్లడించింది.

స్కేలబుల్ ML అప్లికేషన్‌లపై అధిక దృష్టి పెడుతూ, స్క్రిప్టింగ్ భాషలలో ప్రావీణ్యం కలిగి, ML మోడల్‌లను రూపొందించగల సామర్థ్యం(ability) కలిగిన AI నిపుణుల కోసం పలు సంస్థలు ఎదురు చూస్తున్నాయి. డేటా, ML ఇంజనీర్లు సంవత్సరానికి రూ. 14 లక్షల వరకు, డేటా ఆర్కిటెక్ట్‌లు(Data Architects) రూ. 12 లక్షల వరకు జీతాన్ని పొందవచ్చు. ఈ రంగాల్లో ఎనిమిదేళ్ల అనుభవం కలిగిన అభ్యర్థులు(Candidates) ఏడాదికి రూ.25 నుంచి 45 లక్షలకు పైగా జీతాలను అందుకోవచ్చు.

ప్రస్తుతం నిరుద్యోగులు AI నైపుణ్యాలపై దృష్టి పెడితే వారు కెరీర్ పరంగా దీర్ఘకాలిక ప్రయోజనాలను(Long term benefits) అందుకుంటారని ఈ నివేదిక చెబుతోంది. 37 శాతం సంస్థలు తమ ఉద్యోగులకు AI- సిద్ధంగా ఉన్న వర్క్‌ఫోర్స్‌(Workforce)ను రూపొందించడానికి, సంబంధిత సాధనాలను అందించడానికి సిద్ధమవుతున్నాయి.

మరో 30 శాతం సంస్థలు వర్క్‌ఫోర్స్‌లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు AI శిక్షణ కార్యక్రమాలు(Training programs) తప్పనిసరి అని చెబుతున్నాయి. AIలో డిమాండ్-సప్లయ్ టాలెంట్(talent) గ్యాప్‌ని పూరించడానికి అవసరమైన కార్యక్రమాలు చేపడుతున్నట్లు 56 శాతం సంస్థలు ప్రకటించాయి.

Updated Date - 2023-03-21T10:14:59+05:30 IST