షాపుల్లో కొనే పాలు సేఫ్ అని అనుకుంటున్నారా...? ఈ వార్త చదివితే మార్కెట్లో పాలు కొనడానికి కూడా భయపడతారేమో..!

ABN , First Publish Date - 2023-02-24T15:21:40+05:30 IST

మీరు ప్రతిరోజూ షాప్‌ల్లో పాలు కొంటుంటారా? నమ్మకమైన బ్రాండ్లకు చెందిన పాలు కాకుండా ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ పాలు వాడుతుంటారా? అయితే జాగ్రత్త.. నకిలీ, కల్తీ పాలు ప్రస్తుతం విరివిగా మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి.

షాపుల్లో కొనే పాలు సేఫ్ అని అనుకుంటున్నారా...? ఈ వార్త చదివితే మార్కెట్లో పాలు కొనడానికి కూడా భయపడతారేమో..!

మీరు ప్రతిరోజూ షాప్‌ల్లో పాలు కొంటుంటారా? నమ్మకమైన బ్రాండ్లకు చెందిన పాలు కాకుండా ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ పాలు వాడుతుంటారా? అయితే జాగ్రత్త.. నకిలీ, కల్తీ పాలు ప్రస్తుతం విరివిగా మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) కల్తీ పాల వ్యవహారం బయటపడింది. ఆ పాలను హానికర రసాయనాలతో కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ఆ పాలను ఒక్క ఏడాది వాడితే కేన్సర్ (cancer) బారిన పడడం ఖాయం.

రాజ్‌గఢ్‌లో కృత్రిమ రసాయనాలతో (Milk made with Chemicals) పాలను తయారు చేస్తున్న ఫ్యాక్టరీ గుట్టు రట్టైంది. పాల ఫ్యాక్టరీ నిర్వాహకుడు యూట్యూబ్ చూసి పాలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. చవకగా లభించే హానికర రసాయనాలతో పాలు తయారు చేసి అమ్మేస్తున్నాడు. ఈ విధంగా చేయడం వల్ల అతడికి 200% కంటే ఎక్కువ లాభం వస్తోంది. ఖైరాసి గ్రామానికి చెందిన హేమరాజ్ డిగ్రీ చదువుకున్నాడు. అతడికి ఓ పాల డైరీ ఉంది. గ్రామస్థుల నుంచి పాలను కొనుగోలు చేసిన తర్వాత వాటిని సేకరించి ప్లాంట్‌కు పంపిస్తారు. పాల డెయిరీలో హేమరాజ్‌కు పెద్దగా లాభం కనబడలేదు. దీంతో యూట్యూబ్‌లో డబ్బు సంపాదించే మార్గాలను వెతుకుతూ ఉండేవాడు.

milk1.jpg

ఓ రోజు యూట్యూబ్‌లో నకిలీ పాలను తయారు చేస్తున్న వీడియో చూశాడు. తనకు ఎలాగూ పాల డైరీ ఉంది కనుక ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. యూట్యూబ్‌లో (Youtube) చెప్పిన ప్రకాకరం మార్కెట్‌ నుంచి కొన్ని రసాయనాలను తీసుకొచ్చి నకిలీ పాలు తయారు చేశాడు. అయితే మొదట్లో పాలు బాగా రాలేదు. నెమ్మదిగా సాధన చేస్తూ పట్టు సాధించాడు. ఆ పాలను మార్కెట్‌‌కు సరఫరా చేశాడు. ఆ పాలు నకిలీవని (Fake Milk) ఎవరూ గుర్తించలేకపోయారు. దీంతో హేమ్‌రాజ్‌ వెనకడగుగు వేయలేదు. రూ.20 ఖర్చుతో లీటరు పాలు తయారు చేసి వాటిని రూ.55కు విక్రయించేవాడు.

55 ఏళ్ల మహిళతో 25 ఏళ్ల కుర్రాడి ప్రేమాయణం.. పెళ్లికోసం చేసుకున్న దరఖాస్తును చూసి అవాక్కైన అధికారులు..!

హేమరాజ్ పగటిపూట డెయిరీ వద్ద గ్రామస్థుల నుంచి పాలు కొనుగోలు చేసేవాడు. రాత్రి సమయంలో రసాయనాలతో నకిలీ పాలను తయారు చేసి, నిజమైన పాలలో నకిలీ పాలను కలిపి రాజ్‌గఢ్ జిల్లాలో సరఫరా చేసేవాడు. 5 లీటర్లతో ప్రారంభమైన నకిలీ పాల తయారీ కొద్ది రోజుల్లోనే 30 లీటర్లకు చేరుకుంది. ఆరు నెలల్లోనే ఈ సంఖ్య 300 లీటర్లకు చేరుకుంది. ఈ నెల ఫిబ్రవరి 20న గ్రామంలో కల్తీ పాల తయారీ జరుగుతున్నట్లు కలెక్టర్‌కు సమాచారం అందింది. దీంతో జిల్లా ఆహార శాఖ అధికారులు పోలీసులతో కలిసి ఫ్యాక్టరీపై దాడులు చేశారు. హానికర రసాయానాలతో పాలు తయారువుతున్నట్టు కనుగొని ఫ్యాక్టరీని సీజ్ చేశారు. హేమరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-02-25T20:37:57+05:30 IST