Hyderabad: తాను చనిపోతూ నలుగురి జీవితాల్లో వెలుగులు..
ABN , Publish Date - Dec 14 , 2023 | 08:53 AM
ఇంటి వద్ద కిందపడి తీవ్ర గాయాలపాలై బ్రెయిన్‌డెడ్‌కు గురైనఓ వ్యక్తి తాను చనిపోతూ నలుగురి జీవితాల్లో
మన్సూరాబాద్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ఇంటి వద్ద కిందపడి తీవ్ర గాయాలపాలై బ్రెయిన్‌డెడ్‌కు గురైనఓ వ్యక్తి తాను చనిపోతూ నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. కామినేని ఆస్పత్రి ప్రతినిధుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా తొర్రూర్ మండలం వెల్కట్టే గ్రామానికి చెందిన కొమ్ము సత్యనారాయణ(40) ఈ నెల 11న ఇంటి వద్ద కింద పడి గాయాలపాలయ్యాడు. అతన్ని ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చేర్పించగా.. బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు మంగళవారం వైద్యులు ప్రకటించారు. కుటుంబసభ్యుల అంగీకారంతో అతని శరీరం నుంచి లివర్, కిడ్నీ, కంటి శుక్లాలను సేకరించారు. అందులోని ఒక కిడ్నీని మలక్‌పేట యశోద ఆస్పత్రికి, కంటి శుక్లాలను సరోజినీదేవి కంటి ఆస్పత్రికి తరలించినట్లు కామినేని ఆస్పత్రి ప్రతినిధులు తెలిపారు.