Hyderabad: శతాబ్దం నాటి రాతిబావి.. ఎద్దులతో నీటిని తోడుతున్న వైనం
ABN , Publish Date - Dec 29 , 2023 | 10:59 AM
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము(President Draupadimurmu) తాజాగా ప్రారంభించిన శతాబ్దం నాటి రాతి మోట బావిని ప్రజల సందర్శనార్థం తెరిచారు. ఒంగోలు(Ongoles) నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన జత ఎద్దుల సహాయంతో మోట పద్ధతిన రాతి బావి నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు.
- రాష్ట్రపతి నిలయంలో సందర్శకులకు అనుమతి
అల్వాల్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము(President Draupadimurmu) తాజాగా ప్రారంభించిన శతాబ్దం నాటి రాతి మోట బావిని ప్రజల సందర్శనార్థం తెరిచారు. ఒంగోలు(Ongoles) నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన జత ఎద్దుల సహాయంతో మోట పద్ధతిన రాతి బావి నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. రాష్ట్రపతి నిలయంలోని వివిధ అవసరాల కోసం ఈ బావి నీటిని ఉపయోగిస్తున్నారు. సందర్శకులు ఈ బావికి సంబంధించిన విశేషాలను తెలుసుకోవడానికి వీలుగా ఆడియో-వీడియోను ఏర్పాటు చేసినట్లు ఆర్పీ నిలయం మేనేజర్ రజనీ గురువారం వెల్లడించారు. సందర్శకులు చూడటానికి నిలయంలో ప్రత్యేకంగా టేకుతో ఏర్పాటు చేసిన 36 మీటర్ల (120) అడుగుల పొడువైన ఫ్లాగ్‌పోస్ట్, జాతీయ జెండా, రాతిపై చెక్కిన దక్షిణామూర్తి శివుడు, నంది శిల్పాల నుంచి నీళ్లు జాలువారే వ్యవస్థ, మూడు మెట్ల బావులున్నాయి. నాలెడ్జ్ గ్యాలరీలో రెండు కొత్త ఎన్‌క్లేవ్‌లను ఏర్పాటు చేశారు. నాలెడ్జ్ గ్యాలరీల వెలుపల ‘ఏక్‌భారత్, శ్రేష్ఠ్ భారత్’ అంటూ స్ఫూర్తినిచ్చేలా రాక్ పెయింటింగ్‌లతో తీర్చిదిద్దారు. వీటిని తిలకించడానికి సందర్శకులు అధికంగా వస్తున్నారు.