Share News

Viral: ఆయోధ్య శ్రీ రామమందిరం చూడ్డానికి వెళ్లాలా? హోటల్స్ ఇలా బుక్ చేసుకోండి..!

ABN , Publish Date - Dec 23 , 2023 | 10:16 PM

అయోధ్య వెళ్లాలనుకునే వారు హోటళ్లు ఇలా బుక్ చేసుకోండి

Viral: ఆయోధ్య శ్రీ రామమందిరం చూడ్డానికి వెళ్లాలా? హోటల్స్ ఇలా బుక్ చేసుకోండి..!

ఇంటర్నెట్ డెస్క్: మరి కొన్ని రోజుల్లో శ్రీ రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయోధ్యలో కొలువు దీరిన రాముల వారిని చూసేందుకు యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. జనవరి 22న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ మహా క్రతువుకు ప్రధాని మోదీతో సహా దేశంలోని పలు రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా పీఠాధిపతులు, సాధువులు కూడా ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాలుపంచుకోనున్నారు.

అయితే, ప్రారంభోత్సవం తరువాత కూడా శ్రీరామ మందిరానికి తాకిడి అధికంగా ఉంటుందని రామమందిర ట్రస్టు అంచనా వేస్తోంది. సాధారణ రోజుల్లో సగటున రోజుకు 1.5 లక్షల మంది సందర్శిస్తారనేది ఓ అంచనా.

అయితే, ప్రారంభోత్సవం తరువాత అయోధ్య వెళ్లానుకునే వారికి హోటళ్లు, టిక్కె్ట్ల బుకింగ్ కీలకం. ఈ దిశగా ఇప్పటికే అనేక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. స్థానికంగా ధర్మశాలలతో పాటూ పలు హోటళ్లు, రిసార్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి అడ్రస్‌లు ఫోన్ నెంబర్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. రామమందిర దేవాలయాన్ని సందర్శించాలనుకున్న వారు వెబ్‌సైట్లోని నెంబర్లో సంప్రదించి తగు ఏర్పాట్లు చేసుకోవచ్చు(Hotel bookings Ayodhya).


  • రాయల్ హెరిటేజ్ హోటల్- ఎన్‌హెచ్ 27 సరయూ బ్రిడ్స్ పక్కన అయోధ్య (81888290901)

  • బేడీ డ్రీమ్ హోటల్- ఎన్ హెచ్ 27 , సరయూ బ్రిడ్జీ సమీపంలో.. (84000334035)

  • అవధ్ సన్‌షైన్ ప్యాలెస్ - ఎన్ హెచ్ 27 సరయూ బ్రిడ్జీ సమీపంలో (9151547575)

  • సూర్యా ప్యాలెస్- భానుమతి రోడ్, అయోధ్య బైపాస్ (9838771777)

  • హోటల్ రామాయణ- బూత్ నెం 7 షానవాజ్‌పూర్ మాంఝా దర్శన్ నగర్ అయోధ్య- 224135 (6386902021)

  • తారాజీ రిసార్ట్ - సాకేత్ పురి యోజన ఎదురుగా, దేవ్‌కాలీ బైపాస్ క్రాసింగ్, ఎన్‌హెచ్ 27 అయోధ్య (710100095, 7311160000)

  • హోటల్ పంచశీల- దేవ్‌కాలీ బైపాస్ క్రాసింగ్ పక్కన, సాకేత్ పురి యోజన ఎదురుగా, దేవకాలి బైపాస్ క్రాసింగ్, ఎన్ హెచ్ 28 అయోధ్య (7706829463, 9984074000)

  • తిరుపతి- సివిల్ లైన్ ఫైజాబాద్ 001, అయోధ్య (8874210002)

  • కృష్ణ ప్యాలెస్- 1/13/357, సివిల్ లైన్ అయోధ్య (8874210002)

  • రామ్‌ప్రస్థా- న్యూ ఘాట్ అయోధ్య (8115000097)

గమనిక:

పైన పేర్కొన్న హోటళ్లు, రిసార్టులు, ధర్మశాలలు, ప్రైవేటువని గమనించగలరు. వీటికి సంబంధించి అద్దెలు భక్తులే చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - Dec 23 , 2023 | 10:20 PM