పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ... పండాక పసుపుపచ్చ... ఎందుకలా? రంగులు మారడం వెనుక కారణం ఇదే!

ABN , First Publish Date - 2023-04-09T12:56:29+05:30 IST

ఏదైనా పండు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా, పండాక పసుపు రంగులోకి ఎందుకు మారుతుందో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ... పండాక పసుపుపచ్చ... ఎందుకలా? రంగులు మారడం వెనుక కారణం ఇదే!

ఏదైనా పండు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా, పండాక పసుపు రంగులోకి ఎందుకు మారుతుందో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది తెలుసుకునేముందు క్లోరోప్లాస్ట్‌(Chloroplast) అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. క్లోరోప్లాస్ట్‌లు ఆకుపచ్చని మొక్కల కణాలు. వీటిలో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది కిరణజన్య సంయోగక్రియ(Photosynthesis) ప్రక్రియలో సహాయపడుతుంది. దీని కారణంగా పండు కాయ దశలో ఉన్నప్పుడు పచ్చగా కనిపిస్తుంది.

చెట్టు కొమ్మపై ఉన్న పండు ఆకుపచ్చగా ఉంటే అది సూర్యకాంతి(sunlight) నుండి ఆహారాన్ని తీసుకుంటున్నదని అర్థం. అంటే ప్రస్తుతానికి అది తినేందుకు సిద్ధంగా లేదు. క్రమంగా ఈ క్లోరోప్లాస్ట్ 'క్రోమోప్లాస్ట్'('Chromoplast')గా మారుతుంది, ఈ సమయంలో పండు రంగు కూడా మారడం ప్రారంభమవుతుంది కొన్నిసార్లు అది ఎర్రగా మారుతుంది. పండు పండడం అనేది ఒక రసాయన ప్రక్రియ(Chemical process). ఈ ప్రక్రియలో పండుకు రుచి, రంగు, వాసన వంటి అనేక అంశాలు మారుతాయి. ఈ ప్రక్రియలో పండులోని స్టార్చ్(Starch) చక్కెరగా మారుతుంది. క్లోరోప్లాస్ట్ తగ్గినప్పుడు పండుకుండే ఆకుపచ్చ రంగు(green color) కూడా తగ్గుతుంది.

పండు పక్వానికి వచ్చే ప్రక్రియలో కొత్త వర్ణద్రవ్యం(pigment) కూడా ఏర్పడుతుంది. ఇథిలీన్ హార్మోన్ పండ్లు పండే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. సూర్యకాంతి నుండి ఆహారం తీసుకోవడం ద్వారా పండు అభివృద్ధి చెందుతున్నంత కాలం ఆకుపచ్చగా ఉంటుంది. పూర్తిగా అభివృద్ధి(Development) చెందిన తర్వాత అది ఆహారం తీసుకోవడం మానేస్తుంది. అందుకే దాని రంగు కూడా మారడం మొదలవుతుంది. కాయ.. పండుగా మారడం వెనుకనున్న సూత్రం ఇదే!

Updated Date - 2023-04-09T13:03:27+05:30 IST