Sharwanand Marriage: శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?

ABN , First Publish Date - 2023-01-05T17:32:27+05:30 IST

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్‌లలో శర్వానంద్ (Sharwanand) ఒకరు. ఈమధ్య ఓ రియాలిటీ షో‌లోకి అతిథిగా వచ్చిన శర్వానంద్.. తన పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు.. ప్రభాస్ (Prabhas) చేసుకున్నాకే నేను కూడా పెళ్లి...

Sharwanand Marriage: శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?
Hero Sharwanand

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్‌లలో శర్వానంద్ (Sharwanand) ఒకరు. ఈమధ్య ఓ రియాలిటీ షో‌లోకి అతిథిగా వచ్చిన శర్వానంద్.. తన పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు.. ప్రభాస్ (Prabhas) చేసుకున్నాకే నేను కూడా పెళ్లి చేసుకుంటాననే సమాధానం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అధికారికంగా వచ్చిన వార్త ఏమిటంటే.. శర్వా త్వరలో పెళ్లిచేసుకోబోతున్నాడు. రెండు వారాల క్రితం శర్వా పెళ్లి ఫిక్స్ అయిందని.. ఇప్పుడీ విషయాన్ని ఆయన తల్లిదండ్రులు రివీల్ చేసినట్లుగా తెలుస్తోంది. పెళ్లి ఏప్రిల్‌లో ఉంటుందని కూడా తెలిసింది. (Sharwanand Marriage)

ప్రభాస్ పెళ్లి తర్వాతే నా పెళ్లి అని.. ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చిన శర్వానంద్.. సడెన్‌గా తన పెళ్లికి లగ్గం పెట్టేయడంతో.. టాలీవుడ్‌తో మిగతా బ్యాచ్‌లర్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అది సరే.. ఇంతకీ శర్వా చేసుకోబోయే అమ్మాయి ఎవరని అనుకుంటున్నారా? శర్వా చేసుకోబోయే అమ్మాయి రెడ్డి కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలిసింది. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోందని.., కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో ఉందని చెబుతున్నారు. ఆమె సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుందట. అయితే ఆమె మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కుటుంబానికి చాలా దగ్గర బంధువు అని.. బొజ్జలకి (Bojjala family) మనవరాలు అవుతుందని, శర్వా ఆమెని ఒక స్నేహితుడి ద్వారా కలిశాడని సమాచారం. బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కుమారుడైన సుధీర్ (Bojjala Sudhir Reddy)కి ఆ అమ్మాయి ఫ్యామిలీ బాగా దగ్గరివాళ్లని తెలిసింది. కొంతకాలంగా శర్వా‌ ఆ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడని.. ఇప్పుడు ఇరు వైపుల పెద్దల అంగీకారంతో శర్వా.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడనేది తాజా సమాచారం. ఈ పెళ్లితో టాలీవుడ్ మోస్ట్ బ్యాచులర్స్‌లో ఒకరైన శర్వానంద్ ఒక ఇంటివాడు అవుతున్నాడు. ఏప్రిల్‌లో శర్వా పెళ్లి ఫిక్సయింది. (Sharwanand Marriage)

Updated Date - 2023-01-05T22:51:53+05:30 IST