Share News

Health Tips: భోజనం తరువాత స్వీట్లు తింటే ఆ మజానే వేరు.. కానీ ఈ నిజాలు తెలిస్తే..

ABN , First Publish Date - 2023-10-20T10:23:19+05:30 IST

ఈ మధ్య కాలంలో తిండి విషయంలో బాగా హడావిడి పెరిగింది. జిహ్వచాపల్యం కొద్దీ భోజనం తరువాత స్వీటు తినడం అలవాటైనవారు ఉన్నారు, కానీ స్వీట్లు తింటే జరిగేది ఇది..

Health Tips: భోజనం తరువాత స్వీట్లు తింటే ఆ మజానే వేరు.. కానీ ఈ నిజాలు తెలిస్తే..

లోకో భిన్న రుచిః అని ఓ సంస్కృత మాట ఉంది. లోకంలో ఒకొక్కరికి ఒకో అభిరుచి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి ఆకలి ఖచ్చితంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో తిండి విషయంలో బాగా హడావిడి పెరిగింది. భోజనం తరువాత ఐస్ క్రీమ్ లేదా స్వీటు తినడం చాలామంది అలవాటు. విందుభోజనాల్లోనే ఇలాంటి పద్దతి ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లో కూడా భోజనం తరువాత స్వీటు తినడం అలవాటైంది. ఇంట్లోని ఫ్రిజర్ లో ఐస్ క్రీమ్ స్టాక్ ఉంచుకోవడం, కేజీల కొద్ది స్వీట్లు కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకోవడం చేస్తుంటారు. భోజనం తరువాత స్వీటు తింటే కలిగే అనుభూతి గురించి ఏమో కానీ ఆరోగ్యానికి మాత్రం ఇది అస్సలు మంచిది కాదని అంటున్నారు. అసలు భోజనం తరువాత స్వీట్లు తింటే(Sweets eating after meals) కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుంటే..

పండుగ లేదా రోజువారీ భోజనం తరువాత ఐస్ క్రీం, గులాబ్ జామ్, రసగుల్లా, కోవా, జ్యూస్ వంటివి తీసుకోవడం చాలామందికి అలవాటు. భోజనం తరువాత స్వీట్లు తింటే చాలా తృప్తిగా అనిపిస్తుంది. కానీ అప్పటికే భోజనం ఫుల్ గా తిని ఉండటం వల్ల స్వీట్లు తింటే అది ఖచ్చితంగా అధికబరువుకు కారణం అవుతుంది. అధికబరువు సమస్యతో బాధపడేవారు స్వీట్లను తినడం మానుకోవాలని వైద్యులు కూడా చెబుతారు.

Health Facts: గాఢ నిద్రలో ఉండగా కొంత మంది ఎందుకు ఏడుస్తుంటారు..? ఈ 10 కారణాల వల్లేనా..?


చాలామంది రాత్రి సమయాల్లో స్వీట్లు తినాలనుందని చెబుతుంటారు. ఇదేం వింత కోరిక అని అనిపిస్తుంటుంది వాళ్ల మాటలు వింటే. కానీ దీనికి ప్రధాన కారణం డోపమైన్ అనే రసాయనం. శరీరం డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేసినప్పుడు తీపి పదార్దాలు తినాలనే కోరిక పుడుతుంది. సాధారణంగానే రాత్రి పూట ఆహారం జీర్ణం కావడం కష్టం. అలాంటిది భోజనం తరువాత మళ్లీ స్వీట్లు తింటే జీర్ణక్రియను చేతులారా ఇబ్బందులలోకి నెట్టినట్టేనని అంటున్నారు. ఇది చర్మసంబంధ సమస్యల నుండి నిద్రలేమి, చక్కెర స్థాయిలు పెరగడం వంటి ఇతర ఇబ్బందులకు కూడా కారణం అవుతాయి. ఇకపోతే అధికశాతం స్వీట్లు పాలు, పంచదార, మైదా, రవ్వ వంటి వాటితో తయారుచేస్తారు. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. భోజనం తరువాత అధిక కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవడం కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా దారితీస్తుంది.

Money Earning Tips: జీరో పెట్టుబడి.. నెలకు రూ.లక్షకు పైగానే లాభం.. ఇదేం వింత వ్యాపారం అని డౌటా..? అసలు కథేంటంటే..!


Updated Date - 2023-10-20T10:23:19+05:30 IST