Girls Sitting on Car Windows: కారు విండోల్లోంచి బయటకు వచ్చి మరీ ఇద్దరమ్మాయిల వింత నిర్వాకం.. వెతికి పట్టుకుని సరదా తీర్చేసిన పోలీసులు..!

ABN , First Publish Date - 2023-03-09T16:14:23+05:30 IST

5వేల మంది పోలీసుల బందోబస్తున్నా ఇలా జరగడంతో అందరూ షాకవుతున్నారు..

Girls Sitting on Car Windows: కారు విండోల్లోంచి బయటకు వచ్చి మరీ ఇద్దరమ్మాయిల వింత నిర్వాకం.. వెతికి పట్టుకుని సరదా తీర్చేసిన పోలీసులు..!

ఈకాలంలో అమ్మాయిలు అబ్బాయిలకంటే తామేం తక్కువ కాదని ఎన్నో రంగాలలో ప్రూవ్ చేసుకుంటున్నారు. కేవలం ఇలా ప్రతిభను ప్రూవ్ చేసుకోవడమే కాదండోయ్.. అబ్బాయిలకేమీ తీసిపోమని వెర్రివేషాలు కూడా వేస్తుంటారు. ఇద్దరు అమ్మాయిలు ఇలాంటి పనే చేశారు. కారు విండోల్లోనుంచి బయటకు వచ్చి, ఆ విండోలలో కూర్చుని వీరు చేసిన స్టంట్ కు పోలీసుల నుండి ఊహించని అనుభవం ఎదురయ్యింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం నోయిడా(Noida)లో ఈ మధ్య కాలంలో యువత వెర్రి పరాకాష్టకు చేరింది. ఇక్కడ రహదారుల మీద, వివిధ ప్రాంతాలలో యువత రకరకాల స్టంట్ లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాగని అవేమీ ప్రతిభ కలిగిన పనులు కాదు, పైత్యం ఎక్కువై చేస్తున్న పనులు. ఓ ఇద్దరు అమ్మాయిలు కూడా ఇలాంటి పనే చేశారు. నోయిడాలో ధనవంతులు నివసించే ప్రాంతంగా సెక్టార్-15A పేరొందింది. నోయిడాకు చెందిన చాలా మంది వీఐపీలు ఇదే ప్రాంతంలో నివసిస్తుంటారు. మరికొంతమంది ఆ ప్రాంతానికి పనుల మీద వచ్చి వెళుతుంటారు. అలాంటి ప్రాంతంలో ధనవంతుల కుటుంబాలకు చెందిన ఇద్దరమ్మాయిలు రన్ అవుతున్న కారు విండో గ్లాసెస్ పూర్తీగా ఓపెన్ చేసి ఆ విండోలలో కూర్చున్నారు. అంతటితో ఆగకుండా కూర్చున్నవాళ్ళు అలాగే నిలబడుకుని స్టంట్ లు చేయసాగారు.

Read also: Viral Video: బారీకేడ్స్ రంధ్రాల్లోంచి వేళ్లు పెడుతూ ఎకసెక్కాలు.. చివరకు మనోడి పరిస్థితి ఏంటో మీరే చూడండి..!


ఈ కారుకు వెనుక ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీళ్ళ వేషాలను చూశాడు. వీళ్ళకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుని వీళ్ళను వెనుక నుండి ఫోటో తీశాడు. ఆ ఫొటోకు పోలీసులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టారు. 'వీరి మీద చర్యలు తీసుకోండి' అని పోలీసులకు ఒక రిక్వెస్ట్ మెన్షన్ చేశారు. అది చూసిన పోలీసులు వెంటనే స్పందించారు. ఫొటోలో ఉన్న కారు నెంబర్ ఆధారంగా అమ్మాయిలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే నెంబర్ ప్లేట్ ఆధారంగా వీళ్ళకు 23వేల 500రూపాయల ఫైన్ వేశారు. ఈ తతంగం అంతా హోలీ పండుగ సందర్భంగా జరిగింది. హోలీ రోజు సుమారు 5వేలమంది పోలీసులు నోయిడా నగరంలో బందోబస్తు విధులలో ఉన్నారు. ఇంత బందోబస్తు ఉన్నా ఇలాంటి స్టంట్ జరగడం యువత నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటున్నారంతా...

Updated Date - 2023-03-09T16:14:23+05:30 IST