Whats App Scam: వాట్సాప్‌లో ఈ కోడ్‌లతో కాల్స్ వస్తున్నాయా?..అస్సలు లిఫ్ట్ చేయొద్దు.. ఎందుకంటే?
ABN , First Publish Date - 2023-05-10T18:03:14+05:30 IST
వాట్సప్(WhatsApp) మళ్లీ మోసగాళ్లకు టార్గెట్‌గా మారింది. చాలా మంది వాట్సప్ యూజర్లు +84, +62, +60 ప్రారంభ కోడ్(Code)లతో అంతర్జాతీయ నెంబర్ల(International Numbers)నుంచి ..
వాట్సప్(WhatsApp) మళ్లీ మోసగాళ్లకు టార్గెట్‌గా మారింది. చాలా మంది వాట్సప్ యూజర్లు +84, +62, +60 ప్రారంభ కోడ్(Code)లతో అంతర్జాతీయ నెంబర్ల(International Numbers)నుంచి గుర్తు తెలియని కాల్స్ వస్తుంటడంపై ట్విట్టర్(Twitter)లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మోసగాళ్ల పట్ల యూజర్లు ఎలా జాగ్రత్తగా ఉండాలో వాట్సప్ సంస్థ యూజర్లకు పలు సూచనలు చేస్తున్నారు.
వాట్సప్‌లో వినియోగదారులను మోసగించేందుకు ఫ్రాడ్‌స్టర్లు మరోసారి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇది వాట్సప్‌కు కొత్తేమి కాదు. గతంలో కూడా ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా స్కామర్‌లు ప్రజలను మోసగించేందుకు వారి డబ్బును దొంగిలించేందుకు టార్గెట్ చేశారు. దీనికి కారణం వాట్సప్ యాప్ ద్వారా ఎక్కువ మందిని చేరుకోవడం చాలా సులభం. దాదాపు రెండు బిలియన్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లను కలిగి వాట్సప్ మరోసారి స్కామర్ల(Scammers)కు టార్గెట్‌గా మారింది. చాలామంది యూజర్లు +84, +62, +60 వంటి ఇతర అంతర్జాతీయ నెంబర్ల నుంచి గుర్తు తెలియని కాల్స్ వస్తున్నట్లు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు.
మలేషియా, కెన్యా, వియత్నాం, ఇథియోపియా వంటి దేశాల నుంచి వాట్సాప్ వినియోగదారులకు ISD కోడ్‌లతో యాదృచ్ఛికంగా కాల్స్ వస్తున్నాయని తేలింది. ఇలాంటి కాల్స్ ఎందుకు వస్తున్నాయో ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కొంతమందికి రోజుకు కనీసం 2 నుంచి 4 కాల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త సిమ్ తీసుకున్నవారికి అంతర్జాతీయ నెంబర్లనుంచి ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
WhatsApp యొక్క తాజా కాల్ స్కామ్: ఏమి చేయాలి? సురక్షితంగా ఎలా ఉండాలి?
అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాలర్‌ను రిపోర్ట్ చేసి బ్లాక్ చేస్తే చాలు. గుర్తు తెలియని కాలర్ ఓ విధమైన మాల్వేర్‌ను కలిగి వుండి మీ డేటా లేదా డబ్బును దొంగిలించే అవకాశం ఉంది. కాబట్టి గుర్తు తెలియని కాలర్ నుంచి వచ్చిన మెసేజ్‌లు, లింక్‌లను క్లిక్ చేయకూడదు. ఖచ్చితంగా అలాంటి కాల్స్, మేసేజ్‌లు బ్లాక్ చేయాలని మెటా ఆధర్యంలో నడుస్తున్న ఈ మెసేజింగ్ ఫ్లాట్ ఫారమ్ సంస్థ సూచిస్తోంది. మరోవైపు వాట్సప్‌లో జాబ్ ఆఫర్ స్కామ్ కూడా జరుగుతోంది. దీనిపై యూజర్లు జాగ్రత్తగా ఉండాలని, తెలియని వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. WhatsApp వంటి ప్లాట్‌ఫారమ్‌లో ఉద్యోగం ఆఫర్ చేస్తున్న వ్యక్తి గుర్తింపును ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి.
"మా సంస్థ వినియోగదారుల భద్రతకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక సాంకేతికతను కలిగి వుంది. 2021 ఐటీ నిబంధనల ప్రకారం నెలవారీ వినియోగదారు భద్రతా నివేదిక, వినియోగదారు ఫిర్యాదుల వివరాలు విడుదల చేస్తున్నాం. ఒక్క మార్చి నెలలోనే 4.7 మిలియన్లకు పైగా ఖాతాలను WhatsApp నిషేధించింది," అని కంపెనీ తెలిపింది.
వాట్సప్‌లో కాలర్‌ని బ్లాక్ చేసి రిపోర్ట్ చేయడం ఎలా?
1. మీరు ముందుగా WhatsAppని ఓపెన్ చేసి సెట్టింగ్ బటన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
2. ఇప్పుడు, Privacy >Blocked Contacts ని నొక్కండి.
3. Add” button నొక్కండి.
4. ఇప్పుడు మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్ కోసం ఎంచుకోండి.