Share News

Friends: స్నేహితులు ఎక్కువమంది ఉన్నా కష్టమేనా? ఈ నిజాలు తెలిస్తే..

ABN , First Publish Date - 2023-11-30T15:18:47+05:30 IST

చాలామంది నాకు బోలెడు ఫ్రెండ్స్ అని అంటుంటారు. కానీ అసలు నిజం ఇదే..

Friends: స్నేహితులు  ఎక్కువమంది ఉన్నా కష్టమేనా?  ఈ నిజాలు తెలిస్తే..

ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో బంధాలు ఉంటాయి. కానీ అన్నింటిలోకి స్నేహం చాలా గొప్పది. తల్లిదండ్రులతో, జీవిత భాగస్వామితో చెప్పుకోలేని విషయాలను కూడా స్నేహితులతో చెప్పుకుంటూ ఉంటారు. స్నేహితులు ఎప్పుడూ ఆపద సమయాలలో ఆదుకుంటూ, మంచి సలహాలు ఇస్తుంటారు. చాలామందికి ఇద్దరు ముగ్గరు మాత్రమే స్నేహితులు ఉంటారు. ఇంకొందరికి ఒక్కరే క్లోజ్ ఫ్రెండ్ కూడా ఉంటారు. కానీ కొందరు మాత్రం బ్యాచ్ గా ఉంటారు. 6మంది కంటే ఎక్కువ స్నేహితులు ఉండటం అస్సలు సరికాదని అంటున్నారు రిలేషన్ షిప్ నిపుణులు. స్నేహితులు ఉండకూడదని రూల్ ఏంటి అని ఆశ్చర్యంగా అనిపించవచ్చు. దీని వెనుక కారణాలు తెలుసుకుంటే..

చాలామంది నిజానికి స్నేహంగా ఉండేది కొద్దిమందితోనేనట. ఫ్రెండ్స్ అని క్లోజ్ ఫ్రెండ్స్ అని వర్గాలుగా ఉంటుంటారు. 3 కంటే తక్కువ మంది స్నేహితులు ఉంటే ఆ వ్యక్తి ఒంటరి తనానికి తొందరగా లోనయ్యే అవకాశం ఉంటుంది. అదే 6మంది కంటే ఎక్కువమంది స్నేహితులు ఉంటే అందరితో స్నేహం విషయంలో సమానంగా ఉండలేరట. దీనికి కారణం అందరితోనూ ఒకే విధంగా ఉండలేకపోవడమే. కొందరితో సన్నిహితంగానూ, మరికొందరితో దగ్గరితనం తక్కువగానూ ఉంటుంది. ఈ కారణంగా స్నేహితుల మధ్య మనస్ఫర్ధలు ఏర్పడి వాళ్లే శత్రువులుగా తయారయ్యే అవకాశం కూడా ఉంటుందట.

ఇది కూడా చదవండి: Health Tips: ఆయిల్ ఫుడ్స్ తిన్నా సరే కొవ్వు అస్సలు పెరగకూడదంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే..!



అందరూ నా ఫ్రెండ్సే అనుకునే ముందు బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, సాధారణ బంధాల మద్య తేడాను తెలుసుకోవాలి. 3 నుండి 5 లేదా 6 మంది స్నేహితులు ఉంటే వారి స్నేహాన్ని స్వీట్ స్పాట్ అని అంటారు. వీరి మధ్యన స్నేహం బలంగా ఉంటుంది. సామాజిక అవసరాల కోసం, సలహాల కోసం ఎప్పుడూ కలుస్తూ, మాట్లాడుకునేవారిని స్నేహితుల లెక్కలో పరిగణించరట. దీనికి కారణం అవసరాలు, సహాయాల విషయంలో మార్పులు జరిగితే వ్యక్తుల మధ్య సత్సబంధాలు కూడా తగ్గిపోతాయి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే స్నేహితులు ఎక్కువగా ఉంటే బెస్ట్ ఫ్రెండ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చాలామంది స్నేహితులు ఎక్కువగా ఉంటే స్నేహంతో ఉన్నట్టు నటిస్తారు. ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటే ఇతరులకు బెస్ట్ ఫ్రెండ్ గా ఉండలేరట.

ఇది కూడా చదవండి: Health Facts: అందరూ కామన్ గా చేస్తున్న ఈ బిగ్ మిస్టేక్ వల్లే ఏటా 50లక్షల మరణాలు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..


Updated Date - 2023-11-30T15:18:55+05:30 IST