Former CM: మాజీ సీఎంకు అస్వస్థత.. వైద్యంకోసం మళ్లీ కేరళకు..
ABN , First Publish Date - 2023-05-26T11:39:08+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన చికిత్స కోసం కేరళ వెళ్లారు.

చెన్నై, (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేకు విముక్తి కల్పించేందుకు త్వరలో శశికళతో భేటీ అవుతానని ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) ఆ ప్రయత్నాలు చేపట్టక ముందే అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలే ఆయన కేరళకు వెళ్ళి మూలికా వైద్యం చేయించుకున్నారు. బుధవారం సాయంత్రం కేరళ నుంచి ఆయన పెరియకుళానికి తిరిగొచ్చారు. గురువారం ఉదయం మళ్ళీ ఆయన కేరళ పయనమయ్యారు. మరో నాలుగు రోజులపాటు ఆయన కేరళలోనే మూలికా వైద్యం పొందనున్నారు. ఈ వివరాలను ఓపీఎస్ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జీసీడీ ప్రభాకర్ వెల్లడించారు.