విమానంలో ప్రయాణికురాలిని సీటుకు కట్టేసిన సిబ్బంది.. ఆమె ఏం చేసిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-01-31T12:32:29+05:30 IST

విమానంలో ఆమె చేస్తున్న పని ఆపలేకి....

విమానంలో ప్రయాణికురాలిని సీటుకు కట్టేసిన సిబ్బంది.. ఆమె ఏం చేసిందో తెలిస్తే..

ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణం చేయాలంటే చాలా మంది ఆప్షన్ విమాన ప్రయాణమే. ఓ మహిళ అలా ప్రయాణం చేయడానికి విమానమెక్కింది. కానీ ఆమె చేసిన పనికి విమానంలో సిబ్బంది ఆమెను సీటుకు కట్టేయాల్సి వచ్చింది. ఇంతకూ ఆమె ఏం చేసింది అనే విషయంలోకి వెళితే..

ఇటలీకి చెందిన పావోలా అనే మహిళ ఇటలీ నుండి ముంబై వస్తున్న విస్తారా విమానం ఎక్కింది. ఆమె కొనుగోలు చేసింది ఎకానమీ టికెట్ అయితే ఆమె బిజినెస్ క్లాస్ సీటులో కూర్చుంది. ఇది గమనించిన విమానం సిబ్బందిలో ఒక ఎయిర్ హోస్టెస్ పావోలా దగ్గరకు వెళ్ళి 'మీరు కూర్చోవలసిన సీటు వేరే ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చోండి' అని చెప్పింది. అయితే పావోలా మద్యం సేవించి ఉండటం వల్ల ఎయిర్ హోస్టెస్ ను తిట్టింది, అంతటితో ఆగకుండా కొట్టింది. విమాన సిబ్బందిలో ఒక వ్యక్తి ఇదంతా చూసాడు. అతడు తన తోటి ఉద్యోగినికి సపోర్ట్ గా అక్కడికి వెళ్ళి పావోలాను ఆపడానికి ప్రయత్నించాడు. అయితే పావోలా ఆ వ్యక్తిపై ఉమ్మి వేసింది. అంతటితో ఆగకుండా అక్కడికక్కడే ఆమె దుస్తులు తీసేసి తిరగసాగింది.

పావోలా చేస్తున్న పనిని ఎలా ఆపాలో తెలియని సిబ్బంది ఆమెను సీటుకు కట్టేశారు. విమానం ల్యాండ్ అవ్వగానే ఆమెను పోలీసులకు అప్పగించారు. అయితే 25వేల రూపాయలతో పావోలాకు బెయిల్ వచ్చిందట. కేసు మాత్రం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈమధ్య విమాన ప్రయాణికుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయని, మీడియాలో వస్తున్న వార్తలే అందుకు నిదర్శనమని పావోలా విషయం తెలిసిన నెటిజన్లు అంటున్నారు.

Updated Date - 2023-01-31T12:32:36+05:30 IST