45 ఏళ్ల వయసులో ఇదేం పాడుబుద్ధి.. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా..?

ABN , First Publish Date - 2023-02-21T19:57:45+05:30 IST

ఆ వ్యక్తి వయసు 45 ఏళ్లు.. యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు పిల్లలకు తండ్రి.. ఆ వయసు వచ్చిన వ్యక్తికి అదేం పోయే కాలమో తన కూతురి వయసు ఉన్న యువతితో ప్రేమలో (Love Affair) పడ్డాడు..

45 ఏళ్ల వయసులో ఇదేం పాడుబుద్ధి.. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా..?

ఆ వ్యక్తి వయసు 45 ఏళ్లు.. యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు పిల్లలకు తండ్రి.. ఆ వయసు వచ్చిన వ్యక్తికి అదేం పోయే కాలమో తన కూతురి వయసు ఉన్న యువతితో ప్రేమలో (Love Affair) పడ్డాడు.. అందరినీ వదిలేసి తన వయసులో సగం వయసు ఉన్న బాలికతో పారిపోయాడు.. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) అయోధ్యకు సమీపంలో ఈ ఘటన జరిగింది.

అయోధ్యకు సమీపంలోని మిల్కీపూర్‌కు చెందిన 18 ఏళ్ల బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 13న తమ గ్రామానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి తన కుమార్తెను ప్రలోభపెట్టి ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడని ఫిర్యాదు చేశాడు (45 Years old man ran away with 18-year-old girl). బాలికతో పాటు వెళ్లిపోయిన ఆ వ్యక్తి ఇద్దరు పిల్లలకు తండ్రి అని, తన కుటుంబాన్ని వదిలేసి 18 ఏళ్ల బాలికతో వెళ్లిపోయాడని తెలిపాడు. మార్చిలో తన కూతురికి పెళ్లి ఉందని చెప్పాడు.

స్కూల్లో చికెన్ లెగ్ పీసుల గోల.. టీచర్లను గదిలో పెట్టి తాళం వేసిన విద్యార్థులు..!

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే వారం రోజులు గడుస్తున్నా ఆ ఇద్దరినీ పోలీసులు పట్టుకోలేకపోయారు. త్వరలో బాలికను, ఆ వ్యక్తిని వెతికి పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

Updated Date - 2023-02-21T19:57:46+05:30 IST