Drone: చేపల వలలో చిక్కిన డ్రోన్‌

ABN , First Publish Date - 2023-06-07T09:02:17+05:30 IST

చేపలవేట సాగిస్తున్న జాలరి విసిరిన వలలో పెద్ద డ్రోన్‌ లభించింది. తిరువొత్తి యూరు అప్పర్‌నగర్‌కు చెందిన అన్బు అనే జాలరి

Drone: చేపల వలలో చిక్కిన డ్రోన్‌

చెన్నై, (ఆంధ్రజ్యోతి): స్థానిక తిరువొత్తియూరు(Thiruvottiyur) సముద్రతీర ప్రాంతంలో చేపలవేట సాగిస్తున్న జాలరి విసిరిన వలలో పెద్ద డ్రోన్‌ లభించింది. తిరువొత్తి యూరు అప్పర్‌నగర్‌కు చెందిన అన్బు అనే జాలరి, అదే ప్రాంతానికి చెందిన మరో ముగ్గురు జాలర్లను వెంటబెట్టుకుని ఫైబర్‌ పడవలో చేపల వేటకు వెళ్ళాడు. తీరం నుంచి మైలు దూరంలో చేపల కోసం జాలర్లు వల విసిరారు. కాసేపటికి ఆ వలలో పెద్ద డ్రోన్‌ లభించింది. వెంటనే ఆ డ్రోన్‌ను జాలర్లు కాశిమేడు చేపలరేవు పోలీసులకు అప్పగించారు. రెండడుగుల పొడవు, అడుగు ఎత్తు, ఆరు రెక్కలు కలిగిన ఉన్న ఆ డ్రోన్‌ నావికా దళానికి చెందినదని పోలీసులు గుర్తించారు. ఆ డ్రోన్‌పై సాగర్‌ రక్షణ సాంకేతిక పరిజ్ఞానం అని రాసి ఉన్నట్లు కనుగొన్నారు. నావికాదళం అధికారులు ఆ డ్రోన్‌ను నిఘా పనుల కోసం ఎగురవేసి ఉంటారని, సాంకేతిక లోపంతో ఆ పరికరం సముద్రంలో మునిగి ఉంటుందని పోలీసులు భాస్తున్నారు. ఈ డ్రోన్‌ గురించి నావికాదళం అధికారులకు పోలీసులు సమాచారం అందించారు.

Updated Date - 2023-06-07T09:02:17+05:30 IST