Signature Loan: ఎన్నోసార్లు బ్యాంకులకు వెళ్లి ఉంటారు కానీ.. ఈ సిగ్నేచర్ లోన్ గురించి ఎప్పుడైనా విన్నారా..? ఒక్క సంతకం పెడితే..!

ABN , First Publish Date - 2023-09-19T14:50:23+05:30 IST

బ్యాంకు వాళ్లు ఇచ్చే హోమ్, వెహికల్, పర్సనల్ లోన్లు గురించి మనకు బాగానే తెలుసు. అలాగే గోల్డ్ లోన్ గురించి కూడా చాలా మందికి సమాచారం ఉంది. అయితే సిగ్నేచర్ లోన్ గురించి మాత్రం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కేవలం ఒక్క సంతకం చేస్తే చాలు.. బ్యాంకులు లోన్లు ఇచ్చేస్తాయి.

Signature Loan: ఎన్నోసార్లు బ్యాంకులకు వెళ్లి ఉంటారు కానీ.. ఈ సిగ్నేచర్ లోన్ గురించి ఎప్పుడైనా విన్నారా..? ఒక్క సంతకం పెడితే..!

బ్యాంకు వాళ్లు ఇచ్చే హోమ్ (Home Loan), వెహికల్, పర్సనల్ లోన్లు (Personal Loan) గురించి మనకు బాగానే తెలుసు. అలాగే గోల్డ్ లోన్ (Gold Loan) గురించి కూడా చాలా మందికి సమాచారం ఉంది. అయితే ``సిగ్నేచర్ లోన్`` (Signature Loan)గురించి మాత్రం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కేవలం ఒక్క సంతకం చేస్తే చాలు.. బ్యాంకులు లోన్లు ఇచ్చేస్తాయి. అయితే సిగ్నేచర్ లోన్ తీసుకునేందుకు అందరూ అర్హులు కారు. కేవలం కొద్ది మందికి మాత్రమే బ్యాంకులు సిగ్నేచర్ ‌లోన్‌ను ఆఫర్ చేస్తాయి. దీనిని ``క్యారెక్టర్ లోన్`` అని కూడా అంటారు.

నిజానికి సిగ్నేచర్ లోన్ అనేది ఒక రకమైన వ్యక్తిగత రుణం లాంటిది. బ్యాంకులు ఎలాంటి పూచీకత్తూ లేకుండా ఈ లోన్లను జారీ చేస్తాయి. అందుకే ఈ లోన్‌కు వడ్డీ రేటు (Interest Rate) ఎక్కువగా ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డు వడ్డీ రేటుతో పోల్చుకుంటే మాత్రం తక్కువగానే ఉంటుంది. అయితే ఈ లోన్ పొందాలంటే మాత్రం ముందుగా బ్యాంక్ విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. ఈ లోన్ రావాలంటే మీ క్రెడిట్ స్కోరు (Credit Score) 580 నుంచి 700 వరకు ఉండాలి. అలాగే నెలవారీ పేమెంట్లు చేసేందుకు తగినంత ఆదాయం పొందుతూ ఉండాలి.

Viral Video: ప్రాంక్ వీడియో చేద్దామనుకుంటే పరిస్థితి తారమారైంది.. రోడ్డు మీదే కొట్టుకున్న అమ్మాయి, అబ్బాయి.. వీడియో వైరల్

లోన్ తప్పక చెల్లిస్తానని మీరు హామీ ఇవ్వాలి. అలాగే మీ తరఫున ఓ గ్యారెంటర్ కూడా సంతకం పెట్టాలి. మీరో ఓ సిగ్నేచర్ లోన్ తీసుకుని పూర్తిగా చెల్లించిన తర్వాత బ్యాంకులు మీకు మరోసారి లోన్ ఇస్తాయి. మీరు ఏ అవసరానికైనా సిగ్నేచర్ లోన్ పొందవచ్చు. ఇంటికి మరమ్మతులు చేయాలనుకున్నా, ఆసుపత్రి బిల్లు చెల్లించాలనుకున్నా లేదా విహార యాత్రల కోసం కూడా ఈ రుణం తీసుకోవచ్చు. ఎలాంటి గ్యారెంటీ లేకుండా ఇస్తున్నారు కాబట్టి మిగతా లోన్లతో పోల్చుకుంటే దీనికి కాస్త వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది.

Updated Date - 2023-09-19T14:50:23+05:30 IST